Gold at ISSF Junior World Cup: అనుష్క డబుల్
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:13 AM
వర్ధమాన షూటర్ అనుష్క థోకర్ ఐఎ్‌సఎ్‌సఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో అదరగొడుతోంది. టోర్నమెంట్ ఆమె రెండో స్వర్ణ పతకం చేజిక్కించుకుని భళా అనిపించింది. మహిళల 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అనుష్క టైటిల్...
రెండో స్వర్ణం కొల్లగొట్టిన భారత షూటర్
అడ్రియన్‌కు రజతం
జూ. వరల్డ్ కప్ షూటింగ్
న్యూఢిల్లీ : వర్ధమాన షూటర్ అనుష్క థోకర్ ఐఎ్‌సఎ్‌సఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో అదరగొడుతోంది. టోర్నమెంట్ ఆమె రెండో స్వర్ణ పతకం చేజిక్కించుకుని భళా అనిపించింది. మహిళల 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అనుష్క టైటిల్ దక్కించుకుంది. ఇదే కేటగిరీ పురుషుల విభాగంలో అడ్రియన్ కర్మాకర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఈ రెండింటితో కలిపి టోర్నీలో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కి చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలున్నాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో 18 ఏళ్ల అనుష్క 461 పాయింట్లతో పసిడి పతకం అందుకుంది. టోర్నమెంట్‌లో ఇంతకుముందు అనుష్క మహిళల 50మీ. రైఫిల్ ప్రోన్‌లో బంగారు పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. న్యూట్రల్ అథ్లెట్లు అనస్టాసిలా సోరోనిక (454.9) రజతం, మారియా క్రుగ్లోవా (444) కాంస్య పతకం చేజిక్కించుకున్నారు. పురుషుల 50 మీ. త్రీపీ విభాగంలో ఐదుగురు భారత షూటర్లు సహా మొత్తం 12 మంది తలపడ్డారు. అడ్రియన్ కర్మాకర్ 454.8 పాయింట్ల స్కోరుతో రజత పతకం సాధించాడు. న్యూట్రల్ అథ్లెట్లు డిమిత్రి పిమెనోవ్ (459.9) స్వర్ణం, కమిల్ నురియా ఖెమ్టోవ్ (441) కాంస్య పతకం గెలుపొందారు.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి