Share News

World Athletics 2025: హాల్‌ అదుర్స్‌

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:01 AM

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల హెప్టాథ్లాన్‌ స్వర్ణాన్ని అమెరికాకు చెందిన అన్నా హాల్‌ సొంతం చేసుకుంది. ఏడు పోటీల ఈ ఈవెంట్‌లో మొత్తం 6,888 పాయింట్లు సాధించిన ఆమె...

World Athletics 2025: హాల్‌ అదుర్స్‌

హెప్టాథ్లాన్‌లో స్వర్ణం కైవసం

ప్రపంచ అథ్లెటిక్స్‌

టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల హెప్టాథ్లాన్‌ స్వర్ణాన్ని అమెరికాకు చెందిన అన్నా హాల్‌ సొంతం చేసుకుంది. ఏడు పోటీల ఈ ఈవెంట్‌లో మొత్తం 6,888 పాయింట్లు సాధించిన ఆమె కెరీర్‌లో తొలిసారి ప్రపంచ టైటిల్‌ అందుకుంది. తద్వారా దిగ్గజ హెప్టాథ్లెట్‌ జాకీ జాయ్‌నర్‌ కెర్సీ తర్వాత వరల్డ్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న అమెరికా అథ్లెట్‌గా 24 ఏళ్ల అన్నా రికార్డు నెలకొల్పింది. కేట్‌ ఓ కానర్‌ (ఐర్లాండ్‌), తాలియా బ్రూక్స్‌ (అమెరికా) రజత, కాంస్య పతకాలు నెగ్గారు.

అన్నూరాణి, గుల్వీర్‌ విఫలం: భారత అథ్లెట్లు గుల్వీర్‌ సింగ్‌, అన్నూరాణి ప్రపంచ చాంపియన్‌షి్‌పలో విఫలమయ్యారు. పురుషుల 5వేల మీటర్ల పరుగులో గుల్వీర్‌, మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూరాణి ఫైనల్‌కు చేరలేకపోయారు. హీట్‌-2లో తలపడిన గుల్వీర్‌ 13ని.42.34సె.లో గమ్యం చేరి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. రెండు హీట్లలో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఐదోసారి వరల్డ్‌ అథ్లెటిక్స్‌ బరిలో దిగిన 33 ఏళ్ల అన్నూరాణి గ్రూప్‌ ‘ఎ’ క్వాలిఫికేషన్‌లో 55.18 మీ. దూరం ఈటెను విసిరి 15వ స్థానం సాధించింది. ఓవరాల్‌గా 29వ స్థానం దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 06:01 AM