World Athletics Championship: అనిమేశ్ అదిరెన్
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:26 AM
యువ స్ర్పింటర్ అనిమేశ్ కుజుర్ రికార్డు సృష్టించాడు. 200 మీటర్ల రేసులో ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్ దక్కించుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న జాతీయ అంతరాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో చత్తీ్‌సగఢ్‌కు చెందిన అనిమేశ్...
200 మీటర్ల రేసులో ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్
ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష స్ర్పింటర్
న్యూఢిల్లీ: యువ స్ర్పింటర్ అనిమేశ్ కుజుర్ రికార్డు సృష్టించాడు. 200 మీటర్ల రేసులో ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్ దక్కించుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న జాతీయ అంతరాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో చత్తీ్‌సగఢ్‌కు చెందిన అనిమేశ్.. 200 మీటర్ల రేసును 20.63 సెకన్ల రికార్డు టైమింగ్‌తో అధిగమించి స్వర్ణం సాధించాడు. ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మెరుగైన అనిమేశ్.. వచ్చేనెల 13 నుంచి టోక్యో వేదికగా జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించాడు. ప్రపంచ టోర్నీలో 200 మీటర్ల రేసులో మొత్తం 48 మంది అథ్లెట్లు పోటీపడతారు. అయితే వీరిలో కొందరు కటాఫ్ టైమింగ్ (20.15 సెకన్లు)తో నేరుగా ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు ఎంపికైతే, మరికొందరికి ర్యాంకింగ్స్ ఆధారంగా బెర్త్ దక్కుతుంది. అంతరాష్ట్ర టోర్నీకి ముందు ప్రపంచ టోర్నీ రేసులో 42వ స్థానంలో ఉన్న అనిమేశ్.. తాజా ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో ముందుకెళ్లి బెర్త్ సాధించినట్టు భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. ఈ క్రమంలో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించిన తొలి పురుష స్ర్పింటర్‌గా 22 ఏళ్ల అనిమేశ్ చరిత్ర సృష్టించాడు.
నందిని దూరం
తెలుగు అథ్లెట్ నందిని అగసర ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగింది. తెలంగాణకు చెందిన నందిని ఇప్పటికే హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో ప్రపంచ టోర్నీకి ఎంపికైనా.. గాయం కారణంగా టోక్యో క్రీడల్లో పాల్గొనడం లేదని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో స్వర్ణం నెగ్గిన నందిని.. ఆ ప్రదర్శనతో ప్రపంచ టోర్నీకి బెర్త్ దక్కించుకుంది. అయితే, ఆసియా చాంపియన్‌షిప్ సందర్భంగానే మోచేతికి గాయమైందనీ, తానింకా కోలుకోకపోవడంతోనే టోక్యో ఈవెంట్‌కు దూరమవుతున్నట్టు 22 ఏళ్ల నందిని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News