Share News

Asia Cup 2025: బంగ్లా నిలిచింది

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:57 AM

ఆసియా కప్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గట్టెక్కింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన పోరులో 8 పరుగుల తేడాతో..

Asia Cup 2025: బంగ్లా నిలిచింది

అఫ్ఘాన్‌పై విజయం

ఆసియా కప్‌లో నేడు

పాకిస్థాన్‌ X యూఏఈ

రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

అబుధాబి: ఆసియా కప్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గట్టెక్కింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన పోరులో 8 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్‌జీద్‌ హసన్‌ (52), సైఫ్‌ హసన్‌ (30) రాణించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించింది. ఛేదనలో అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్‌ (35), ఒమర్జాయ్‌ (30), రషీద్‌ (20) మాత్రమే రాణించారు. ముస్తాఫిజుర్‌కు మూడు.. నసూమ్‌, రిషాద్‌, టస్కిన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నసూమ్‌ నిలిచాడు. ఈ గెలుపుతో ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఉన్న బంగ్లా.. గురువారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ జట్టు ఓడిపోతే సూపర్‌-4కు వెళుతుంది.

సంక్షిప్త స్కోర్లు: బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 154/5 (తన్‌జీద్‌ 52, సైఫ్‌ 30; నూర్‌ 2/23, రషీద్‌ 2/26). అఫ్ఘానిస్థాన్‌: 20 ఓవర్లలో 146 ఆలౌట్‌ (గుర్బాజ్‌ 35, ఒమర్జాయ్‌ 30; ముస్తాఫిజుర్‌ 3/28, నసూమ్‌ 2/11, రిషాద్‌ 2/18, టస్కిన్‌ 2/34).

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:57 AM