The Epic Rematch Anand vs Kasparov: 30 ఏళ్ల తర్వాత
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:02 AM
చిరకాల ప్రత్యర్థులు, దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ 30 ఏళ్ల తర్వాత మళ్లీ తలపడనున్నారు. బుధవారం నుంచి జరిగే క్లచ్ చెస్ టోర్నీలో...
ఆనంద్-కాస్పరోవ్ సమరం
క్లచ్ చెస్ టోర్నీలో తలపడనున్న దిగ్గజాలు
సెయింట్ లూయిస్ (యూఎస్): చిరకాల ప్రత్యర్థులు, దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ 30 ఏళ్ల తర్వాత మళ్లీ తలపడనున్నారు. బుధవారం నుంచి జరిగే క్లచ్ చెస్ టోర్నీలో వీరిద్దరూ 12 గేమ్‌లు ఆడనున్నారు. వినూత్న పాయింట్ల విధానంలో జరిగే టోర్నీలో రోజుకు 4 గేముల్లో తలపడతారు. 1995లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో వీరిద్దరూ క్లాసిక్ ఫార్మాట్‌లో ఆడగా.. ఈసారి మాత్రం ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. కాగా, వీరిద్దరి 20 గేముల ముఖాముఖీలో కాస్పరోవ్ 10.5-7.5తో విషీపై ఆధిక్యంలో ఉన్నాడు. 2004లో రిటైర్మెంట్ ప్రకటించిన కాస్పరోవ్ ఎగ్జిబిషన్, బ్లిట్జ్ ఈవెంట్లు ఆడుతున్నాడు. మరోవైపు యువ ఆటగాళ్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ ప్రముఖ ఈవెంట్లలో అడపాదడపా పాల్గొంటున్నాడు. విజేతకు రూ. 62 లక్షలు, ఓడిన వారికి రూ. 44 లక్షల ప్రైజ్‌మనీ అందనుంది. ఒకవేళ సమమైతే చెరిసగం పంచుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News