Anand Kumar Velkumar: ఆనంద్‌కు రెండు స్వర్ణాలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:26 AM
ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షి్‌పలో ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ (22) చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన 42 కి.మీ మారథాన్‌లో...
తొలి స్కేటర్‌గా రికార్డు
న్యూఢిల్లీ: ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షి్‌పలో ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ (22) చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన 42 కి.మీ మారథాన్‌లో విజేతగా నిలిచిన ఆనంద్ ఈ టోర్నీలో రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి భారత అథ్లెట్ అయ్యాడు. అంతకుముందే 1000మీ. స్ర్పింట్‌లోనూ స్వర్ణం గెలిచిన ఈ తమిళనాడు స్కేటర్ వరల్డ్ చాంపియన్‌షి్‌పలో పోడియం సాధించిన మొదటి ప్లేయర్ అయ్యాడు. అంతేగాక 500మీ. స్ర్పింట్‌లోనూ కాంస్యం అందుకున్న ఆనంద్.. ఒకే వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్‌లో 3 పతకాలు సాధించిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి