Speed Skating World Championships 2025: స్పీడ్ స్కేటింగ్‌లో ఆనంద్ స్వర్ణ చరిత్ర
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:59 AM
భారత స్కేటర్ ఆనంద్ కుమార్ వేల్‌కుమార్ చరిత్ర సృష్టించాడు. చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో...
న్యూఢిల్లీ: భారత స్కేటర్ ఆనంద్ కుమార్ వేల్‌కుమార్ చరిత్ర సృష్టించాడు. చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో దేశానికి తొలి స్వర్ణం అందించాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ఆనంద్ సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ర్పింట్‌లో ఒక నిమిషం 24.924 సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలిచాడు. ఆనంద్.. రెండ్రోజుల క్రితం ఇదే టోర్నీ 500 మీటర్ల స్ర్పింట్‌లో కాంస్య పతకం సాధించాడు. దేశానికి మొదటి బంగారు పతకం అందించిన ఆనంద్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. నీ విజయం ఎంతో మంది యువకులకు స్ఫూర్తిదాయకమన్నారు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి