Afghanistan Withdraws: ఆటగాళ్లను బలి తీసుకుంటారా మీతో ఆడేది లేదు
ABN , Publish Date - Oct 19 , 2025 | 05:31 AM
పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ముక్కోణపు టీ20 సిరీ్‌స నుంచి వైదొలగుతున్నట్టు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ శుక్రవారం అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడిలో...
కాబూల్: పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ముక్కోణపు టీ20 సిరీ్‌స నుంచి వైదొలగుతున్నట్టు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ శుక్రవారం అర్ధరాత్రి జరిపిన వైమానిక దాడిలో 14 మంది మరణించారు. ఇందులో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్గతుల్లా, హరూన్ ఉన్నారు. పాకిస్థాన్ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ).. వచ్చేనెల 17 నుంచి 29 వరకు రావల్పిండి, లాహోర్ వేదికలుగా జరిగే ముక్కోణపు టోర్నీనుంచి తప్పుకొంటున్నట్టు వెల్లడించింది. ఈ టోర్నీలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌తోపాటు శ్రీలంక పాల్గొనాల్సి ఉంది.
క్రికెట్ ప్రపంచానికి నష్టం: జైషా
‘ముగ్గురు క్రికెటర్ల మరణం అఫ్గాన్‌కే కాదు క్రికెట్ ప్రపంచానికే నష్టం. ఈ క్లిష్ట సమయంలో అఫ్గాన్ క్రికెట్ బోర్డుకు అండగా ఉంటాం’ అని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా, బీసీసీఐ కార్యదర్శి సైకియా తెలిపారు.
టోర్నీ కొనసాగుతుందన్న పాక్ క్రికెట్
అఫ్గానిస్థాన్ వైదొలగినా ముక్కోణపు టీ20 సిరీస్ యధాప్రకారం కొనసాగుతుందని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టంజేసింది. అఫ్గానిస్థాన్ స్థానంలో జింబాబ్వే జట్టును ఆడిస్తున్నట్టు పీసీబీ ప్రకటించింది.
పాక్‌తో ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలగిన అఫ్గానిస్థాన్ పాక్ వైమానికి దాడిలో..
అఫ్గాన్ క్రికెటర్ల మృతికి నిరసన
ఏసీబీకి ఐసీసీ, బీసీసీఐ మద్దతు
పాక్ సూపర్ లీగ్‌కు రషీద్ గుడ్‌బై!
దాడి అనైతికమని అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అన్నాడు. ఈ దాడికి ప్రతిగా.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను రషీద్ బహిష్కరించినట్టు సమాచారం. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పీఎస్‌ఎల్ జట్టు లాహోర్ క్వలాండర్స్ పేరును రషీద్ తన ఎక్స్ ఖాతా నుంచి తొలగించడం ఇందుకు ఊతమిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News