Afghanistan Thrash Hong Kong: బోణీ అదిరింది
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:26 AM
ఆసియాకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్ అదరగొట్టింది. మంగళవారం హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో రాణించిన రషీద్ సేన 94 రన్స్ తేడాతో గెలిచింది. ముందుగా...
హాంకాంగ్‌పై అఫ్ఘానిస్థాన్ ఘనవిజయం
అబుధాబి: ఆసియాకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్ అదరగొట్టింది. మంగళవారం హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో రాణించిన రషీద్ సేన 94 రన్స్ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (73 నాటౌట్), అజ్మతుల్లా (53) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరి ధాటికి ఆఖరి ఐదు ఓవర్లలో 78 పరుగులు నమోదయ్యాయి. నబీ (33) ఫర్వాలేదనిపించాడు. అటు హాంకాంగ్ ఏకంగా ఐదు క్యాచ్‌లు వదిలేసి ఆసియాకప్ చరిత్రలో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాత భారీ ఛేదనలో హాంకాంగ్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడింది. బాబర్ హయత్ (39), యసీమ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. గుల్బదిన్ నయీబ్, ఫరూఖిలకు రెండేసి వికెట్లు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
అఫ్ఘానిస్థాన్: 20 ఓవర్లలో 188/6 (అటల్ 73 నాటౌట్, అజ్మతుల్లా 53; కించిత్ షా 2/24, ఆయుష్ 2/54).
హాంకాంగ్: 20 ఓవర్లలో 94. (హయత్ 39, యసీమ్ 16; నయీబ్ 2/8, ఫరూఖి 2/16)
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి