Afghanistan Knocked Out: అఫ్ఘాన్ అవుట్
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:03 AM
ఆసియాక్‌పలో అఫ్ఘానిస్థాన్ పోరాటం ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గురువారం శ్రీలంకతో పోరులో ఆరు వికెట్ల తేడాతో పోరాడి ఓడింది...
సూపర్-4లో శ్రీలంక, బంగ్లాదేశ్
అబుధాబి: ఆసియాక్‌పలో అఫ్ఘానిస్థాన్ పోరాటం ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గురువారం శ్రీలంకతో పోరులో ఆరు వికెట్ల తేడాతో పోరాడి ఓడింది. ఈ ఫలితంతో గ్రూప్ ‘బి’ నుంచి లంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4లో అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు సాధించింది. 79/6 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును చివర్లో నబీ (22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60) ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లతో వణికించాడు. పేసర్ తుషారకు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో లంక 18.4 ఓవర్లలో 171/4 స్కోరు చేసి నెగ్గింది. కుశాల్ మెండిస్ (74 నాటౌట్) అజేయంగా నిలిచాడు. 16వ ఓవర్ వరకు అఫ్ఘాన్ గెలుపు దిశగా సాగుతున్నప్పటికీ, ఆఖర్లో మెండిస్ బాదుడుకు ఆశలు వదులుకుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి