Share News

Champions Trophy: రికార్డు సెంచరీ చేసిన అఫ్గాన్ క్రికెటర్.. ఛాంపియన్స్ ట్రోఫీలో కొత్త చరిత్ర..

ABN , Publish Date - Feb 26 , 2025 | 09:16 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ బ్యాట్‌తో విన్యాసాలు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 177 పరుగులు చేశాడు. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Champions Trophy: రికార్డు సెంచరీ చేసిన అఫ్గాన్ క్రికెటర్.. ఛాంపియన్స్ ట్రోఫీలో కొత్త చరిత్ర..
Afghan Cricketer Ibrahim zadran creates new record

ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) మరో సరికొత్త రికార్డు నమోదైంది. అఫ్గాన్ బ్యాటర్ తన విధ్వంసకర శతకంతో కొత్త చరిత్ర లిఖించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim zadran) బ్యాట్‌తో విన్యాసాలు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 177 పరుగులు చేశాడు. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ (165) పేరిట ఉండేది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది (Eng vs AFG).


మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఆ దశలో హష్మాతుల్లా (40)తో కలిసి ఇబ్రహీం ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒక్కసారి కుదురుకున్న తర్వాత ఇబ్రహీం తన జోరు చూపించాడు. బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ (40), ఒమర్జాయ్ (41) కూడా రాణించారు. 106 బంతుల్లో సెంచరీ చేసిన ఇబ్రహీం ఆ తర్వాత మరింత స్పీడు పెంచాడు. మరో 40 బంతుల్లో 77 పరుగులు చేసి అఫ్గాన్‌కు భారీ స్కోరు అందించాడు (Ibrahim zadran record Century).


అఫ్గాన్ నిర్దేశించిన టార్గెట్‌కు ఇంగ్లండ్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. బెన్ డకెట్ (38) ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుంటూ జో రూట్ (74 బ్యాటింగ్), జాస్ బట్లర్ (30 బ్యాటింగ్) చక్కగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలవాలంటే 17 ఓవర్లలో 129 పరుగులు చేయాలి.

ఇవి కూడా చదవండి..

Wasim Akram about Pakistan Team: కోతులు కూడా మీ కంటే చాలా బెటర్.. పాకిస్తాన్ టీమ్‌పై అక్రమ్ సంచలన వ్యాఖ్యలు..


Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..


Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..


మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2025 | 09:16 PM