Share News

సింధు ఇంటిదారి

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:26 AM

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరగగా.. గాయత్రి జోడీ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వరల్డ్‌ నెం:16 సింధు...

సింధు ఇంటిదారి

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌

రెండో రౌండ్‌కు రుత్విక జంట

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరగగా.. గాయత్రి జోడీ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వరల్డ్‌ నెం:16 సింధు 21-19, 13-21, 13-21తో కిమ్‌ గ వున్‌ (కొరియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో 20-12తో గేమ్‌ పాయింట్‌పై నిలిచిన సింధు.. తడబాటుతో ప్రత్యర్థికి పుంజుకొనే అవకాశం ఇచ్చింది. కానీ, చివర్లో ఎలాగోలా గేమ్‌ను దక్కించుకొంది. ఆ తర్వాతి రెండు గేముల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కిమ్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సింధు పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. జనవరిలో జరిగిన ఇండోనేసియా మాస్టర్స్‌ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధు.. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్‌ దాటలేక పోయింది. కాగా, మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌ జోడీ 21-17, 21-13తో చైనీస్‌ తైపీకి చెందిన సంగ్‌ షు యున్‌-యు చెన్‌ హుయ్‌పై వరుస గేముల్లో నెగ్గింది. అయితే, శ్రుతి మిశ్రా-ప్రియా జంట 9-21, 4-21తో కొరియా టాప్‌ సీడ్‌ లి సొ హి-బెక్‌ హ న ద్వయం చేతిలో చిత్తయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌-రుత్విక శివాని జంట 21-10, 7-21, 24-22తో యి హోంగ్‌ వి-నికోల్‌ (చైనీస్‌ తైపీ) జోడీపై గెలిచింది.

ఇవీ చదవండి:

ర్యాంకింగ్స్.. టాప్‌-5లో ముగ్గురు భారత స్టార్లు

ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..

లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2025 | 04:26 AM