Asia Cup 2025: ఈసారీ దంచేశారు
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:43 AM
ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్‌లోనే కాదు.. సూపర్-4లోనూ భారత జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో దాయాది కాస్త పోటీనివ్వగలిగింది....
ఆసియా కప్
భారత్ చేతిలో పాక్ చిత్తు
అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్
అభిషేక్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74)
దుబాయ్: ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్‌లోనే కాదు.. సూపర్-4లోనూ భారత జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో దాయాది కాస్త పోటీనివ్వగలిగింది. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లు వదిలేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) బ్యాటింగ్‌లో మాత్రం ప్రత్యర్థి బౌలర్లను కసిదీరా బాదాడు. అతడికి ఓపెనర్ గిల్ (28 బంతుల్లో 8 ఫోర్లతో 47) సహకరించడంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (58) అర్ధ సెంచరీ సాధించాడు. దూబేకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. తిలక్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్) అజేయంగా నిలిచాడు. హరీ్‌సకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అభిషేక్ నిలిచాడు. కాగా, ఆసియా కప్‌నకు నేడు (సోమవారం) విరామం.
ఓపెనర్ల శతక భాగస్వామ్యం: ఛేదనను భారత్ అదిరే రీతిలో ఆరంభించింది. ఓపెనర్లు అభిషేక్, గిల్ పాక్ బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరుబోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. షహీన్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే అభిషేక్ సిక్సర్‌గా మలిచాడు. స్పిన్నర్ అబ్రార్ ఓవర్‌లోనూ 4,6తో జోరు చూపాడు. మరోవైపు సయీమ్, షహీన్ ఓవర్లలో గిల్ రెండేసి ఫోర్లతో సహకరించాడు. వీరి ధాటికి పవర్‌ప్లేలో 69 పరుగులతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. అలాగే పేసర్లు షహీన్, రౌఫ్ వీరితో మాటల యుద్ధానికి దిగడం కనిపించింది. ఏడో ఓవర్‌లో అభిషేక్ క్యాచ్‌ను ఫర్హాన్ వదిలేయగా, ఓ ఫోర్‌తో 24 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే చక్కటి లెంగ్త్ బాల్‌తో గిల్‌ను పేసర్ అష్రాఫ్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో మూడు ఓవర్లలో సూర్య (0), జోరు మీదున్న అభిషేక్ కూడా అవుటవడంతో స్కోరు నెమ్మదించింది. ఈ దశలో తిలక్, శాంసన్ (13) రిస్కీ షాట్లకు వెళ్లకుండా సంయమనం కనబర్చారు. ఇక 12 బంతుల్లో 9 రన్స్ కావాల్సిన వేళ తిలక్ 19వ ఓవర్‌లో 6,4తో మ్యాచ్‌ను ముగించాడు.
దూకుడుగా ఆరంభించినా..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఈసారి ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించడంతో తొలి పది ఓవర్లలోనే 91 పరుగులు సాధించింది. అయితే భారత బౌలర్ల్లు మధ్యఓవర్లలో కట్టడి చేయగలిగారు. ఓపెనర్ ఫర్హాన్ పేస్, స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగా.. అతడికి ఆరంభంలో సయీమ్ అయూబ్ (21) తోడ్పాటునందించాడు. దీనికి తోడు భారత ఫీల్డింగ్ వైఫల్యం కూడా వీరికి కలిసి వచ్చింది. తొలి ఓవర్‌లోనే ఫర్హాన్ క్యాచ్‌ను అభిషేక్.. ఐదో ఓవర్‌లో సయీమ్ క్యాచ్‌ను కుల్దీప్ వదిలేయడం దెబ్బతీసింది. అటు ఓపెనర్ ఫఖర్ జమాన్ (15)ను మూడో ఓవర్‌లోనే హార్దిక్ అవుట్ చేసినా.. ఫర్హాన్ ఎదురుదాడిని ఆపలేదు. ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రాను సునాయాసంగా ఆడేయడంతో పవర్‌ప్లేలో జట్టు 55/1తో నిలిచింది. ఇందులో బుమ్రానే 34 పరుగులివ్వడం గమనార్హం. ఎనిమిదో ఓవర్‌లో ఫర్హాన్ క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర అభిషేక్ మరోసారి వదిలేయగా అది సిక్స్‌గా మారింది. ఫర్హాన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. చివరకు 11వ ఓవర్‌లో సయీమ్ క్యాచ్‌ను అభిషేక్ అందుకోవడంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో దూబే, వరుణ్, కుల్దీప్ పాక్‌ను నియంత్రించడంతో 11-16 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. అలాగే హుస్సేన్ తలత్ (10)తో పాటు నిలకడగా ఆడుతున్న ఫర్హాన్ వికెట్‌ను కూడా కోల్పోయింది. కానీ చివరి మూడు ఓవర్లలో పాక్ 43 పరుగులతో 170 స్కోరును దాటించగలిగింది.
స్కోరుబోర్డు
పాకిస్థాన్: ఫర్హాన్ (సి) సూర్య (బి) దూబే 58, ఫఖర్ జమాన్ (సి) సంజూ (బి) హార్దిక్ 15, సయీమ్ (సి) అభిషేక్ (బి) దూబే 21, తలత్ (సి) వరుణ్ (బి) కుల్దీప్ 10, నవాజ్ (రనౌట్) 21, సల్మాన్ ఆఘా (నాటౌట) 17, ఫహీమ్ (నాటౌట్) 20, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 171/5; వికెట్ల పతనం: 1-21, 2-93, 3-110, 4-115, 5-149; బౌలింగ్: హార్దిక్ 3-0-29-1, బుమ్రా 4-0-45-0, వరుణ్ 4-0-25-0, కుల్దీప్ 4-0-31-1, అక్షర్ 1-0-8-0, దూబే 4-0-33-2.
భారత్: అభిషేక్ (సి) రౌఫ్ (బి) అబ్రార్ 74, గిల్ (బి) ఫహీమ్ 47, సూర్యకుమార్ (సి) అబ్రార్ (బి) రౌఫ్ 0, తిలక్ (నాటౌట్) 30, సంజూ శాంసన్ (బి) రౌఫ్ 13, హార్దిక్ (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18.5 ఓవర్లలో 174/4; వికెట్ల పతనం: 1-105, 2-106, 3-123, 4-148; బౌలింగ్: షహీన్ షా అఫ్రీది 3.5-0-40-0, సయీమ్ 3-0-35-0, అబ్రార్ 4-0-42-1, హరీస్ రౌఫ్ 4-0-26-2, ఫహీమ్ 4-0-31-1.
1
అంతర్జాతీయ టీ20ల్లో తక్కువ బంతుల్లో (331) 50 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా అభిషేక్. అలాగే ఇన్నింగ్స్‌ను రెండుసార్లు సిక్సర్లతో ఆరంభించిన తొలి భారత ఓపెనర్‌గా అభిషేక్. రోహిత్, శాంసన్, జైస్వాల్ ఒక్కోసారి ఈ ఫీట్ సాధించారు.
1
భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన టీ20ల్లో ఎక్కువ వికెట్లు (15) తీసిన బౌలర్‌గా హార్దిక్
1
భారత్‌పై పవర్‌ప్లేలో తమ అత్యధిక పరుగులు (55) నమోదు చేసిన పాక్
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి