Abhishek Nayar: కేకేఆర్ కోచ్‌గా అభిషేక్ నాయర్
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:20 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన కోచ్‌గా అభిషేక్ నాయర్ ఎంపిక దాదాపుగా ఖరారైంది. మూడేళ్ల నుంచి కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను...
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన కోచ్‌గా అభిషేక్ నాయర్ ఎంపిక దాదాపుగా ఖరారైంది. మూడేళ్ల నుంచి కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను గత జూలైలో కేకేఆర్ తొలగించింది. వారం రోజుల క్రితమే కోచ్ పదవిపై కేకేఆర్ నాయర్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే ఈ విషయమై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పండిట్ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. అలాగే ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుకు చీఫ్ కోచ్‌గా పనిచేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News