World Archery Championships: ప్రీక్వార్టర్స్‌కు 15 ఏళ్ల గాథ ఖడాకే
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:10 AM
వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో టీనేజ్ ఆర్చర్ గాథ ఖడాకే ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. వెటరన్ దీపిక కుమారికి మరోసారి నిరాశే ఎదురైంది...
దీపిక, అంకిత విఫలం ఫ వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షి్‌ప్స
గ్వాంగ్జు (కొరియా): వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో టీనేజ్ ఆర్చర్ గాథ ఖడాకే ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. వెటరన్ దీపిక కుమారికి మరోసారి నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో 15 ఏళ్ల గాథ 6-4తో కేథరినా బౌవర్ (జర్మనీ)పై గెలిచింది. కాగా, సీడింగ్ ఆధారంగా నేరుగా రౌండ్-32లో తలపడిన దీపిక 4-6తో చొయిరున్నీసా (ఇండోనేసియా) చేతిలో, అంకిత భక్త్ 2-6తో షియాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా, మెగా ఈవెంట్‌లో దీపిక విఫలం కావడం ఇది ఆరోసారి.
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి