Share News

Zombie-Rabbits: వామ్మో.. ఇదెక్కడి వింత జీవి.. చూడడానికే భయంకరంగా ఉన్న ఈ జంతువు ఏంటో తెలుసా?

ABN , Publish Date - Aug 14 , 2025 | 07:11 PM

మొహంపై నల్లటి ఆకారంలో వింతైన కొమ్ములను కలిగి ఉన్న కుందేళ్ల ఫొటోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రమాదకర వైరస్ సోకినందు వల్ల అలా మారిపోయాయి.

Zombie-Rabbits: వామ్మో.. ఇదెక్కడి వింత జీవి.. చూడడానికే భయంకరంగా ఉన్న ఈ జంతువు ఏంటో తెలుసా?
Zombie-Rabbits in Colorado

కొలరాడో (Colorado)లోని వింత జంతువులు స్థానికులను భయపెడుతున్నాయి. చూడడానికే భయంకరంగా ఉన్న ఈ జంతువులు నిజానికి కుందేళ్లు (Rabbits). అయితే ప్రమాదకర వైరస్ సోకినందు వల్ల అలా మారిపోయాయి. మొహంపై నల్లటి ఆకారంలో వింతైన కొమ్ములను కలిగి ఉన్న కుందేళ్ల ఫొటోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి (Zombie-Rabbits in Colorado).


సాధారణ కుందేళ్లకు షోప్ పాపిల్లోమా అనే అరుదైన వైరస్ సోకడం వల్ల మొహం, తలపై ఈ తరహా కొమ్ములు ఏర్పడతాయట. ఈ కొమ్ములు ఆయా కుందేళ్ల చూపునకు, నోరు తెరవడానికి కూడా ఆటంకంగా మారుతాయట. కొన్ని రకాల కీటకాలు ఈ వైరస్ వ్యాప్తికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ కుందేళ్లకు మాత్రమే ప్రమాదకరమని, మానవులకు, కుక్కలకు లేదా ఇతర వన్యప్రాణులకు అంటువ్యాధి కాదని నిపుణులు స్పష్టం చేశారు. ఏదేమైనా అలాంటి వైరస్ సోకిన కుందేళ్లకు దూరంగా ఉండడం మంచిదని హెచ్చరించారు.


ఈ వైరస్ సోకిన కుందేళ్లు వాటంతట అవే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతాయని కొలరాడో పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్ ప్రతినిధి కారా వాన్ హూస్ తెలిపారు. ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే ఆ కొమ్ములు పోతాయని తెలిపారు. ఆ వైరస్ సోకిన కుందేళ్లను చంపడానికి ఎవరూ ప్రయత్నించవద్దని తెలిపారు. తినడానికి, తాగడానికి ఆటంకం ఏర్పడితే తప్ప ఆ ఇన్ఫెక్షన్ కుందేలుకు కూడా ప్రమాదకరం కాదని కారా వాన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఎంత పెద్ద పామైనా ముంగిస ముందు బలాదూర్.. థ్రిల్లింగ్ ఫైట్‌లో ఏం జరిగిందో చూడండి..

పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 14 , 2025 | 07:11 PM