Deep ocean camera: సముద్రం అడుగున కెమెరా.. ఈ వింత చేపలను చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 02 , 2025 | 07:23 PM
ఆకాశం, పర్వతాలు, కొండలు, పచ్చని లోయలు ఎన్నో మార్మికమైన విషయాలతో నిండి ఉన్నాయి. భూమి మీద 75% భూభాగాన్ని ఆక్రమించిన మహాసముద్రాలు, వాటి లోతులు ఎన్నో మాయా జీవులకు నిలయంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతికతలు ప్రకృతిని దగ్గరగా పరిశీలించడానికి అవకాశాలను అందిస్తున్నాయి
ఈ విశ్వం ఎన్నో అద్భుతాల సమాహారం. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పూర్తిగా బయటపడని సహజ అద్భుతాలతో నిండి ఉంది. ఆకాశం, పర్వతాలు, కొండలు, పచ్చని లోయలు ఎన్నో మార్మికమైన విషయాలతో నిండి ఉన్నాయి. భూమి మీద 75% భూభాగాన్ని ఆక్రమించిన మహాసముద్రాలు, వాటి లోతులు ఎన్నో మాయా జీవులకు నిలయంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతికతలు ప్రకృతిని దగ్గరగా పరిశీలించడానికి అవకాశాలను అందిస్తున్నాయి (YouTuber deep ocean camera).
యూట్యూబర్ బెర్నీ డిల్లర్‌స్టోన్ తన కెమెరాను ఉపయోగించి ఇండోనేసియాలోని సముద్రపు అడుగుభాగం నుంచి అద్భుతమైన దృశ్యాన్ని రికార్డు చేశాడు. ఇది సముద్రంలో సగటు వ్యక్తి చేరుకోలేని ప్రదేశం. బెర్నీ తన కెమెరాను సముద్రంలో 200 మీటర్ల లోతులో వదిలాడు. అక్కడ కెమెరా ద్వారా వివిధ రకాల చేపలు కనిపించాయి. అలాంటి చేపలు ఇప్పటి వరకు మానవ ప్రపంచం నుంచి దాగి ఉన్నాయి. బెర్నీ ఆవిష్కరణ ప్రస్తుతం సముద్ర నిపుణులలో పెద్ద చర్చకు దారితీసింది (underwater underworld view).
ఆ కెమెరాకు చిక్కిన ఆ చేపలు ఆ ప్రాంతానికి కావు. అవి ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతం నుంచి అక్కడకు వచ్చాయి (never before seen ocean video). ప్రపంచ మహాసముద్రాలలో 20 లక్షలకు పైగా సముద్ర జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 2.5 లక్షల కంటే తక్కువ జాతులను మాత్రమే అధికారికంగా గుర్తించారు. తాజాగా కనిపించిన ఈ చేపలను ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదట. బెర్నీ తీసిన ఈ వీడియో మరిన్ని పరిశోధనలకు నాంది పలకనుంది.
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..
మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో చేప, ఓ వృద్ధుడు ఉన్నారు.. ఎక్కడో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..