Share News

బాబోయ్‌... బయటపడటం కష్టమే..

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:17 AM

పద్మవ్యూహంలోకి వెళితే తిరిగి రావడం కష్టమంటారు. అలాంటి చిక్కుకుపోయే తోట ఇది. ఈ ‘మేజ్‌’లో అడుగుపెడితే బయటకు రావడం అంతసులువు కాదు. చాలామంది బయటకు రాలేక సహాయం కోసం అత్యవసర మీట నొక్కుతారు. ప్రపంచంలోనే అతి పొడవైన ‘మేజ్‌’గా గుర్తింపు పొందింది లండన్‌లోని హార్మింగ్‌షామ్‌ గ్రామ పొలిమేరల్లో ఉన్న ‘లాంగ్లీట్‌ హెడ్జ్‌ మేజ్‌’.

బాబోయ్‌... బయటపడటం కష్టమే..

వంపులు తిరిగిన దారులు... చిక్కటి పొదలు... ఏ దారి ఎటువైపు వెళుతుందో తెలియదు. ఒకరికొకరు కనిపించరు. ‘లాంగ్లీట్‌ హెడ్జ్‌ మేజ్‌’లో కనిపించే దృశ్యం ఇది. ఇంగ్లండ్‌లోని వార్మిన్‌స్టన్‌ పట్టణానికి సమీపంలోని హార్మింగ్‌షామ్‌ గ్రామానికి ఆనుకుని ఉందీ మేజ్‌. ‘లాంగ్లీట్‌ హెడ్జ్‌’ అని పిలిచే ఈ మేజ్‌కు ప్రపంచంలోనే అతి పొడవైన మేజ్‌గా గుర్తింపు ఉంది. ఇందులో అడుగుపెడితే బయటకు రావడానికి ఎంత లేదన్నా గంటన్నర సమయం పడుతుంది.

ప్రత్యేకతలెన్నో....

ఇది 1.5 ఎకరాలలో 2.72 కి.మీ విస్తరించి ఉంది. మేజ్‌ రూపకల్పనలో భాగంగా మొత్తం పదహారు వేల గుబురు పొదలు నాటారు. మేజ్‌లో ఒక మార్గంలో నడుస్తూ ఉంటే పక్కన ఏమీ కనిపించదు. ఎనిమిది అడుగుల ఎత్తులో పొద ఉంటుంది. త్వరగా పూర్తి చేయాలని వేగంగా నడుచుకుంటూ వెళితే డెడ్‌ ఎండ్‌ దర్శనమిస్తుంది. డెడ్‌ ఎండ్‌ ఎదురైతే తిరిగి దారి మార్చి నడక సాగించాల్సి ఉంటుంది.


book7.2.jpg

ప్రపంచంలో అతి పొడవైన ఈ మేజ్‌లో ఆరు చోట్ల వంతెనలుంటాయి. ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు వంతెనపైకి వెళ్లి చూడొచ్చు. వంతెనపై నుంచి చూస్తే మేజ్‌లో ఎక్కడ ఉన్నారో అర్థమవుతుంది. పెద్దవాళ్ల తోడు లేకుండా పిల్లలు మేజ్‌లో వెళ్లకూడదు. ఒకవేళ మేజ్‌లోకి వెళ్లాక బయటకు వచ్చే దారి తెలియకపోతే ఎమర్జెన్సీ బటన్‌ నొక్కాలి. మేజ్‌లో అక్కడక్కడా ‘లిఫ్ట్‌ ఇఫ్‌ లాస్ట్‌’ అని బోర్డులుంటాయి. ఆ బోర్డుల దగ్గర ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ బ్యాకప్‌ స్విచ్‌ను నొక్కడం ద్వారా సహాయం పొందవచ్చు.


ఆ టవర్‌ నుంచి చూస్తే వంపులు తిరిగిన మేజ్‌ కనువిందు చేస్తుంది. నిర్వహణ సిబ్బంది పొదలు పెరిగినప్పుడల్లా కట్‌ చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌ల సహాయంతో సులభంగా దారికనుక్కుని బయటకు వచ్చేస్తున్నారు. ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్‌ ఓపెన్‌ చేసి లొకేషన్‌ని చూస్తూ మేజ్‌లో బయటకు వస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల మజా పోతుందని సిబ్బంది చెబుతుంటారు. మేజ్‌లోకి అడుగుపెట్టక ముందు ఫోన్‌ ఇచ్చి వెళ్లమని సిబ్బంది సూచిస్తుంటారు. ఈ మేజ్‌ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది.

book7.3.jpg


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2025 | 11:17 AM