Worker Collapse Viral Video: పనివాడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోని యజమాని..
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:08 PM
గత సోమవారం రోజూలాగే రిఫిక్ ఖాన్ పనికి వెళ్లాడు. చకచకా పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో అతడి ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. నిలబడడానికి కూడా శక్తి లేకుండా ఇబ్బంది పడసాగాడు.
మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. ఇందుకు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ యజమాని తన కింద పని చేసే వ్యక్తి ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు. పనివాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే యజమాని చూసి ఊరుకున్నాడు. దగ్గరకు కూడా వెళ్లలేదు. తోటి పనివాళ్లు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళుతుండగా దారిలోనే చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అగర్‌మాల్వా జిల్లాలో తిరుపతి ట్రేడర్స్ అనే హోల్ సేల్ షాపు ఉంది.
ఆ షాపులో రఫిక్ ఖాన్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. గత సోమవారం రోజూలాగే పనికి వెళ్లాడు. చకచకా పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో అతడి ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. నిలబడడానికి కూడా శక్తి లేకుండా ఇబ్బంది పడసాగాడు. ఇది గుర్తించిన తోటి పనివాళ్లు అతడ్ని కుర్చీలో కూర్చోబెట్టారు. సపర్యలు చేయసాగారు. యజమానికి ఈ విషయం చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడటంలో బిజీ అయిపోయాడు. రఫిక్ పరిస్థితి అంతకంతకూ విషమించసాగింది.
ఫోన్ మాట్లాడటం అయిపోయినా కూడా యజమాని మాత్రం పట్టించుకోలేదు. తిరిగి చూసి ఊరుకున్నాడే కానీ, దగ్గరకు వెళ్లలేదు. కొద్దిసేపటి తర్వాత తోటి పనివాళ్లు రఫిక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ షాపు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రావి చెట్టు ముందు వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. కారణం ఏంటంటే..
ఆడపిల్లలు రాత్రివేళల్లో కాలేజీ బయటకు వెళ్లకూడదు... మమత వ్యాఖ్యలపై దుమారం