Women Fight Over Squat Machine: జిమ్‌లో కుమ్ములాట.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:53 PM
స్క్వాట్స్ చేస్తున్న మహిళ అక్కడినుంచి వెళ్లిపోయింది. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్ దగ్గరకు వెళ్లింది. ఇంతలో గ్రీన్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్‌లోకి చొరబడింది.
సాధారణంగా జిమ్ అంటే గుర్తుకు వచ్చేది మగవారే. కండలు పెంచడానికో... పొట్ట తగ్గించడానికో చాలా మంది మగవాళ్లు జిమ్‌లో జాయిన్ అవుతూ ఉంటారు. జిమ్‌లో తరచుగా కాకపోయినా.. అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. మగాళ్లు కలబడి కుమ్ముకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆడవాళ్లు జిమ్‌లో జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే, అత్యంత అరుదుగా జిమ్‌లో ఆడవాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. జిమ్‌లో ఓ ఇద్దరు ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. జుట్లు పట్టుకుని మరీ ఇద్దరూ కొట్టుకున్నారు.
ఇంతకీ సంగతేంటంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ ఇద్దరు మహిళలు స్థానికంగా ఉండే ఓ జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తూ ఉన్నారు. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ చేయడానికి స్క్వాట్స్ మిషిన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికే ఓ మహిళ స్క్వాట్స్ చేస్తూ ఉంటే.. పక్కనే నిలబడి తన వంతు కోసం ఎదురుచూస్తూ ఉంది. స్క్వాట్స్ చేస్తున్న మహిళ అక్కడినుంచి వెళ్లిపోయింది. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్ దగ్గరకు వెళ్లింది. ఇంతలో గ్రీన్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్‌లోకి చొరబడింది.
దీంతో బ్లాక్ టీషర్టు వేసుకున్న మహిళ ఆగ్రహానికి గురైంది. గ్రీన్ టీషర్టు వేసుకున్న మహిళను తిట్టింది. దీంతో గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఇద్దరు ఒకరి జట్టు ఒకరు పట్టుకుని కొట్టుకోవటం మొదలెట్టారు. ఇంతలో పక్కనే ఉన్న వారు వారి దగ్గరకు వచ్చారు. ఇద్దర్నీ గొడవ పడకుండా ఆపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య ఎక్కడ చూసినా ఆడవాళ్ల హవానే.. రైళ్లు, మెట్రో, ఆఖరికి జిమ్‌లను కూడా వదలటం లేదు’..‘మీరు జిమ్‌కు వెళుతోంది కండలు పెంచి కలబడ్డానికా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పాక్‌లో శక్తివంతమైన బాంబు పేలుడు.. ఆరుగురు మృతి
అల్సర్లకు కారణమేమిటి.. దీన్ని ఎలా నివారించాలి?