Share News

Terrifying Spider Bite: సాలెపురుగు ఎంత పని చేసింది.. ఆ విషం కారణంగా..

ABN , Publish Date - Dec 19 , 2025 | 07:14 AM

ఓ యువతిని విషపూరితమైన సాలె పురుగు కరిచింది. సాలె పురుగు కాటు వేయటం వల్ల ఆ యువతి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోసాగింది. పాము కుబుసం విడిచినట్లుగా పరిస్థితి మారిపోయింది.

Terrifying Spider Bite: సాలెపురుగు ఎంత పని చేసింది.. ఆ విషం కారణంగా..
Terrifying Spider Bite

ప్రపంచ వ్యాప్తంగా వందలాది రకాల సాలె పురుగుల జాతులు ఉన్నాయి. వాటిలో 90 శాతం వరకు విషపూరితమైనవి కాదు. మిగిలిన 10 శాతం విషపూరితమైనవి. విషపూరితమైన సాలె పురుగులు కుడితే మన పరిస్థితి విషమంగా మారుతుంది. కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. తాజాగా, ఓ యువతిని విషపూరితమైన సాలె పురుగు కరిచింది. సాలె పురుగు కాటు వేయటం వల్ల ఆ యువతి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోసాగింది. పాము కుబుసం విడిచినట్లుగా పరిస్థితి మారిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాకు చెందిన మైనిత అనే యువతికి మే 17వ తేదీన బ్రౌన్ రెక్లెస్ స్పైడర్ కరిచింది. అది కరిచిన కొన్ని గంటల్లోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కోమాలోకి సైతం వెళ్లింది. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికత్స తీసుకోవాల్సి వచ్చింది. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. సరిగా నడవ లేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల పాటు ఆమె గుండె కొట్టుకునే వేగం 140 నుంచి 160 వరకు ఉండింది. పాము కుబుసం విడిచినట్లుగా చర్మం ఊడిపోతూ ఉంది. మైనిత పూర్తిగా కోలుకోవడానికి నెలల సమయం పట్టింది.


తన పరిస్థితి గురించి మైనిత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో తన పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. చర్మం ఊడిపోతున్న వీడియోను కూడా షేర్ చేసింది. సంఘటన జరిగిన నెలల తర్వాత మైనిత వీడియో మరో సారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు రెడ్డిట్‌లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.

viral.jpg


ఇవి కూడా చదవండి

విశాఖపట్నం టు ఢిల్లీ.. వయా సికింద్రాబాద్..

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు

Updated Date - Dec 19 , 2025 | 11:27 AM