Hilarious viral clip: ఏందమ్మా.. మిక్సీతో కూడా బట్టలు ఉతుకుతారా.. ఫన్నీ వీడియోపై నెటిజన్లు స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:21 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఫన్నీ వీడియోలను రూపొందించేందుకు కొందరు విచిత్రమైన ఐడియాలు వేస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఫన్నీ వీడియోలను రూపొందించేందుకు కొందరు విచిత్రమైన ఐడియాలు వేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్, లైక్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (woman washes clothes in mixer).
@Madddy17dutta అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మహిళ బట్టలు ఉతకడానికి రెడీ అవుతోంది. అయితే ఆమె ముందు వాషింగ్ మెషిన్‌కు బదులుగా మిక్సర్ ఉంది. ముందుగా, ఆమె మిక్సర్ జార్‌లో నీరు, వాషింగ్ పౌడర్ వేసింది. ఆ తర్వాత ఆ మిక్సీ జార్‌లో ఉతకాల్సిన బట్టలు వేసి మిక్సీ ఆన్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం వీడియోలో చూపించలేదు. అయితే మిక్సీలో బట్టలు వేస్తే చిరిగిపోతాయనే సంగతి తెలిసిందే (funny viral video).
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Indian viral trend). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 55 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను వీక్షించి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. అలా చేస్తే మిక్సీ అయినా పోతుందని, లేదా బట్టలైనా చిరిగిపోతాయని ఒకరు కామెంట్ చేశారు. ఈమె చాలా తెలివైందని మరొకరు పేర్కొన్నారు. ఈమె తెలివి అదిరిపోయిందని మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇదెక్కడి స్టంట్.. చివరకు ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందో చూడండి..
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 37 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..