Woman Wakes Up While Funeral: అంత్యక్రియల సందర్భంగా కళ్లు తెరిచిన మహిళ.. ఠక్కున పైకి లేచి కూర్చుంది..
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:18 PM
ఓ యువతి ఆ మహిళ దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ గట్టిగా అరుస్తూ పైకి లేచి కూర్చుంటుంది. అటు, ఇటు తిరిగి అరుస్తుంది. ఆ వెంటనే మళ్లీ శవ పేటికలో పడుకుంటుంది.
అంత్యక్రియల సందర్బంగా చనిపోయారు అనుకున్న వారు తిరిగి లేచిన సంఘటనలు చాలా ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వారి వరకు అంత్యక్రియల సందర్భంగా పైకి లేచిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియల సందర్భంగా కళ్లు తెరిచింది. ఠక్కున పైకి లేచి కూర్చుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.
ఓ వీడియోలో.. ఆ మహిళ శవ పేటికలో పడుకుని కెమెరా వైపు కళ్లార్పకుండా చూస్తూ ఉంది. కుటుంబసభ్యులు వెంటనే శవ పేటిక పైకప్పును పక్కకు తీశారు. అంతటితో ఆ వీడియో ముగుస్తుంది. మరో వీడియోలో.. ఓ యువతి ఆ మహిళ దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ గట్టిగా అరుస్తూ పైకి లేచి కూర్చుంటుంది. అటు, ఇటు తిరిగి అరుస్తుంది. ఆ వెంటనే మళ్లీ శవ పేటికలో పడుకుంటుంది.
అయితే, చనిపోయిన ఆ మహిళ బతకటం, పైకి లేచి కూర్చోవటం అంతా ఫేక్ అన్న ప్రచారం జరుగుతోంది. నెటిజన్లు ఆ వీడియోపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘అదంతా ఫేక్.. మనం మరీ అంత ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నామా?’..‘జనాల్ని మోసం చేయడానికి బానే డ్రామాలు చేస్తున్నారు. అంతా యాక్టింగ్’.. ‘ఇలాంటి వీడియోలను చూసినపుడు నిజంగా ఏదైనా జరిగినా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పిల్లలకు పేర్లు పెట్టడమే వృత్తి.. కోట్లు సంపాదిస్తున్న మహిళ
సమాజంలో మార్పు.. మహిళల ద్వారానే సాధ్యం: పవన్