Suggests Baby Names To Billionaires: పిల్లలకు పేర్లు పెట్టడమే వృత్తి.. కోట్లు సంపాదిస్తున్న మహిళ
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:34 PM
ఆమె పేరు పెట్టాలంటే కనీసం 17 వేల రూపాయలు చెల్లించాలి. ఇది బేసిక్ ప్లాన్. ప్రీమియర్ ప్లాన్ ధర 26 లక్షల రూపాయలుగా ఉంది. ‘కోటీశ్వరులైనా సరే పేరు కోసం ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు?’ అనుకుంటున్నారా?..
ఇది సోషల్ మీడియా యుగం. డబ్బులు సంపాదించటం అన్నది చాలా ఈజీ పని. ఇంట్లో కూర్చుని నెలనెలా లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వారు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. ‘ఇది కూడా ఓ పనా’ అని అనిపించే పనుల నుంచి కూడా లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. ఇదే కోవలో అమెరికాకు చెందిన ఓ మహిళ పిల్లలకు పేర్లు పెట్టి కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ సంగతేంటంటే.. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టేలర్ హంఫ్రే బాగా డబ్బున్న వారి పిల్లలకు పేర్లు పెట్టడమే తన వృత్తిగా మార్చుకుంది.
పేర్లు పెట్టడానికి భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటోంది. ఆమె పేరు పెట్టాలంటే కనీసం 17 వేల రూపాయలు చెల్లించాలి. ఇది బేసిక్ ప్లాన్. ప్రీమియర్ ప్లాన్ ధర 26 లక్షల రూపాయలుగా ఉంది. ‘కోటీశ్వరులైనా సరే పేరు కోసం ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు?’ అనుకుంటున్నారా?. ఇక్కడే అసలు బిజినెస్ ట్రిక్ ఉంది. టేలర్ పేర్లు పెట్టడానికి చాలా రకాల రీసెర్చ్‌లు చేస్తుంది. ఆంథ్రోపాలజీ, బ్రాండింగ్, థెరపీ ఈ మూడు కూడా పేరు పెట్టడంలో భాగమే.
అందుకే డబ్బున్న వాళ్లు టేలర్‌తో తమ పిల్లలకు పేర్లు పెట్టించుకోవడానికి ఎగబడుతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్తలు, హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా టేలర్ కస్టమర్లే. తాజాగా, శాన్‌ఫ్రాన్సిస్కో క్రోనికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టేలర్ మాట్లాడుతూ.. ‘పిల్లలకు పేర్లు పెడుతుంటే థెరపిస్ట్‌లాగా ఫీల్ అవుతుంటాను. చాలా మంది భార్యాభర్తలు పిల్లలకు పేర్లు పెట్టడంలో గొడవలు పడి నా దగ్గరకు వస్తూ ఉంటారు. డెలివరీ టైమ్‌లో పిల్లల పేర్ల గురించి గొడవపడి డెలివరీ టైం వాయిదా వేసుకున్న జంటలు కూడా ఉన్నాయి’ అని అంది.
ఇవి కూడా చదవండి
పండుగ ముందు తీవ్ర విషాదం.. భర్త కళ్ల ఎదుటే ముక్కలైన భార్య..
కళంకిత నేతల బిల్లుపై విపక్షం లేకుండానే జేపీసీ