Order Food Without Paying App Fees: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? ఇలా చేస్తే డబ్బులు ఆదా..
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:26 PM
బయట ధర 150 రూపాయలు ఉంటే.. యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే 200పైనే ఉంటుంది. ఏదైనా ఆఫర్ ఉంటే తప్ప తక్కువ ధరకు ఫుడ్ దొరికే అవకాశం ఉండదు.
ఈ మధ్య కాలంలో ఇంట్లో వంటలు చేసుకుని తినే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. జనం ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేస్తున్నారు. అయితే, బయట షాపులో ధరలకు.. ఫుడ్ డెలివరీ యాప్‌లలో ధరలకు చాలా తేడా ఉంటుంది. ప్లాట్ ఫామ్ ఫీజు, మార్క్‌అప్స్, కమిషన్లు కూడా అందులో యాడ్ అవుతాయి. బయట ధర 150 రూపాయలు ఉంటే.. యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే 200పైనే ఉంటుంది. ఏదైనా ఆఫర్ ఉంటే తప్ప తక్కువ ధరకు ఫుడ్ దొరికే అవకాశం ఉండదు.
అదిరిపోయే ట్రిక్ చెప్పిన యువతి..
బయటినుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకునే వారికి క్రిష అనే యువతి అదిరిపోయే ట్రిక్ ఒకటి చెప్పింది. ఆ ట్రిక్ ఫాలో అయితే మీరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. క్రిష తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులో.. ‘జొమాటో, స్విగ్గీ వాడటం ఆపేయండి. నేను ప్రతీరోజూ ఫుడ్ ఆర్డర్ చేసుకునే హోటల్స్‌కు ఫోన్ చేస్తున్నాను. తినాలనుకునే ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నాను. వాళ్లు నా ఫుడ్ ప్యాక్ చేసి రెడీగా ఉంచుతారు. నేను ఊబర్, ర్యాపిడో వాళ్లను హోటల్ దగ్గరకు పంపి పార్సిల్ ఇంటికి తెప్పించుకుంటున్నాను.
డెలివరీ కోసం 50 నుంచి 100 రూపాయల దగ్గర ఖర్చు అవుతుంది. అయినా కూడా ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆర్డర్ చేసుకునే దాని కంటే తక్కువకే ఫుడ్ ఇంటికి వస్తుంది. ఆన్‌లైన్ యాప్స్ మార్క్ అప్స్, ప్లాట్ ఫామ్ ఫీజు, కమిషన్ తీసుకుంటాయి. నేను చెప్పినట్లు చేస్తే ఇవన్నీ ఉండవు. నెలకు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు’ అని పేర్కొంది. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు క్రిషపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి ఐడియా తప్పకుండా ఫాలో అవుతామని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
రక్తంతో లేఖ రాసిన ఫ్యాన్.. భయపడిపోయిన మహేష్ హీరోయిన్..
దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ