Amrita Rao Marriage Proposals: రక్తంతో లేఖ రాసిన ఫ్యాన్.. భయపడిపోయిన మహేష్ హీరోయిన్..
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:56 AM
తెలుగులో అమృత మొదటి సినిమా, చివరి సినిమా కూడా ‘అతిథి’ కావటం గమనార్హం. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తూ వచ్చారు.
హీరోయిన్ అమృత రావు గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. ఆమె తెలుగులో ‘అతిథి’ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా నటించారు. తెలుగులో అమృత మొదటి సినిమా, చివరి సినిమా కూడా ‘అతిథి’ కావటం గమనార్హం. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తూ వచ్చారు. ఆమె నటించిన చాలా హిందీ సినిమాలు తెలుగులో డబ్ అయి రిలీజ్ అయ్యాయి. 2019 తర్వాత ఆమె చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ‘జాలీ ఎల్ఎల్‌బీ 3’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాదియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అమృత మాట్లాడుతూ.. ‘వివాహ్(సినిమా) తర్వాత నాకు ఎన్ఆర్ఐల నుంచి ఎక్కువగా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చేవి. ఫ్యామిలీతో దిగిన ఫొటోలు పంపేవారు. ‘నన్ను పెళ్లి చేసుకోండి’ అని అడిగే వారు. ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేను బాగా నవ్వుకునేదాన్ని. ఇలా ఉన్నారేంట్రా అనుకునేదాన్ని. మరికొంతమంది లెటర్లు రాసేవారు. ఓ సారి ఓ వ్యక్తి రక్తంతో ఓ లేఖ రాశాడు. నాకు చాలా భయం వేసింది.
ఆ వ్యక్తి తరచుగా మా ఇంటి బయట ఉండే టెలిఫోన్ బూత్ దగ్గర నిల్చుని ఉండేవాడు. అక్కడినుంచి నాకు ఫోన్లు చేసేవాడు. మా అమ్మానాన్న ఎక్కువగా అతడి ఫోన్లు ఎత్తేవారు. నేను చాలా తక్కువగా అతడి ఫోన్ కాల్స్ ఎత్తేదాన్ని. జీవితంలో చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నపుడు నా భర్తను కలిశాను. నేను ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాను. అయినా కూడా నాకు నచ్చిన పాత్రలు చేయలేదు. అలాంటి పాత్రలు నా దగ్గరకు కూడా రాలేదు. జనాలు నన్ను నిరాశపర్చడానికి చాలా విషయాలు చెప్పేవారు. నేను పార్టీలకు వెళ్లేదాన్ని కాదు. అవార్డ్స్ ఫంక్షన్లకు కూడా వెళ్లేదాన్ని కాదు. పని, ఇళ్లు అన్నట్లుగా ఉండేదాన్ని. ఒంటరి జీవితాన్ని గడిపాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ
బ్లాక్‌లో ఓజీ టికెట్లు.. రూ. 800 టికెట్ 2500లకు..