Ugly Fight: పోలీస్ స్టేషన్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న పోలీస్, మహిళ
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:51 PM
Ugly Fight: అక్కడ మహిళకు ఓ లేడీ పోలీస్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారు అయింది. ఒకరపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో కొంతమంది లేడీ పోలీసులు ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆమెను టేబుల్‌పై పడేసి కొట్టారు. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. తనకు న్యాయం జరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రా కాలింది విహార్ ప్రాంతానికి చెందిన సర్జు యాదవ్ ఓ కేసుకు సంబంధించి న్యాయ కోరుతూ ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
అక్కడ మహిళకు ఓ లేడీ పోలీస్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారు అయింది. ఒకరపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే స్టేషన్‌లోని మిగిలిన లేడీ పోలీసులు వారి దగ్గరకు వచ్చారు. మహిళపై దాడి చేయటం మొదలెట్టారు. అందరూ కలిసి ఆమెను కొట్టి ఇంటికి పంపేశారు. ఇంటికి వచ్చిన తర్వాత.. తనపై జరిగిన దాడి గురించి ఆ మహిళ ఓ సెల్ఫీ వీడియో తీసింది. దాన్ని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. ‘నిన్న కాలింది విహార్ పోలీస్ స్టేషన్‌లోని స్టాఫ్ అందరూ నాతో తప్పుగా ప్రవర్తించారు. ఆఖరికి మగ పోలీసులు కూడా తప్పుగా ప్రవర్తించారు. గేటు మూసి వేసి, నాపై దాడి చేశారు. నా బట్టలు చింపేశారు. మీరే చూడొచ్చు నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో.. నాకు న్యాయం జరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటా. నాకు న్యాయం కావాలి.. వేరేమీ అక్కర్లేదు’ అని అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై బొత్స సత్యనారాయణ క్లారిటీ
జీఎస్టీ నుంచి గుడ్ న్యూస్..ఇకపై 4 స్లాబులు కాదు..కేవలం రెండు మాత్రమే