Woman Alleges Harassment: బైక్ రైడర్‌పై రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డులో డ్రామా..
ABN , Publish Date - Sep 07 , 2025 | 02:03 PM
అతడు రోడ్డు పక్క బైక్ ఆపేశాడు. ఆమె కిందకు దిగి రైడర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఇద్దరి మధ్యా వాగ్వివాదం మొదలైంది. జనం చుట్టు ముట్టారు. ఏమైందని అడిగారు.
ఓ యువతి తాను ప్రయాణిస్తున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. తనను లైంగికంగా వేధించాడంటూ నడిరోడ్డులో అతడి బైకు ఆపేసింది. గొడవ పెట్టుకుని అతడి దుమ్ము దులిపేసింది. అతడిపై పోలీసులకు కంప్లైంట్ చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి బయటకు వెళ్లడానికి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. బైకు ట్యాక్సీపై కొంత దూరం వెళ్లిన తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమె బైక్ రైడర్‌తో గొడవ పెట్టుకుంది.
అతడు రోడ్డు పక్క బైక్ ఆపేశాడు. ఆమె కిందకు దిగి రైడర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఇద్దరి మధ్యా వాగ్వివాదం మొదలైంది. జనం చుట్టు ముట్టారు. ఏమైందని అడిగారు. ‘ఇతడు నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు’ అని వారికి చెప్పింది. నడిరోడ్డులో అందరూ చూస్తుండగా అతడిపై రెచ్చిపోయింది. రైడర్ ఎంత నచ్చజెప్పటానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. ఇష్టం వచ్చినట్లు అతడ్ని తిట్టింది. ‘మీలాంటి వాళ్ల వల్లే ఢిల్లీ సేఫ్ కాకుండా పోయింది. నిన్ను ఊరికే వదిపెట్టను. నీపై పోలీసులకు కంప్లైంట్ చేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
దీన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ‘ఎన్‌సీఎమ్ ఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ ఎఫైర్స్’ ఖాతాలో ఆ వీడియో విడుదల అయింది. వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆ మహిళకు సపోర్టు చేస్తుంటే.. మరికొంతమంది తిడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని నాలుగు తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి
సోనూసూద్ గొప్ప మనసు.. ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా కూడా..