Cigarette puff effects: ఒక్క సిగెరట్ పఫ్.. ఏం జరుగుతుందో తెలుసా.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:42 AM
సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు సంవత్సరాల తరువాత మాత్రమే మొదలవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్న నిజం వేరేలా ఉంది. సిగరెట్‌ను ఒక్కసారి పీల్చిన వెంటనే వేలాది విష పదార్థాలు కేవలం కొన్ని సెకన్లలోనే శరీరంలోకి ప్రవేశిస్తాయి.
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలుసు. అయితే సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు సంవత్సరాల తరువాత మాత్రమే మొదలవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్న నిజం వేరేలా ఉంది. సిగరెట్‌ను ఒక్కసారి పీల్చిన వెంటనే వేలాది విష పదార్థాలు కేవలం కొన్ని సెకన్లలోనే శరీరంలోకి ప్రవేశిస్తాయి. సిగరెట్ పొగతో శరీరం మొత్తం నిండిపోతుందని చూపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (cigarette smoke in body).
సిగరెట్ కాల్చిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందో మెకానికల్‌గా చూపించే వీడియో ప్రస్తుతం చాలా మందిని ఆలోచింపచేస్తోంది (smoking dangers Video). సిగరెట్ ద్వారా పీల్చిన పొగ సెకెన్ల వ్యవధిలో లోపలికి వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. సిగరెట్‌ను పీల్చే సమయంలో అది దాదాపు 900 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కాలుతుంటుంది. ఆ సమయంలో నికోటిన్, టార్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్, లెడ్, కాడ్మియం వంటి భారీ లోహాలు విడుదలై 7–10 సెకన్ల వ్యవధిలో ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి చేరిపోతాయి.
ఒక్క పఫ్‌తోనే 35–65 మిల్లీలీటర్ల హానికర రసాయనాలతో నిండిన ప్రమాదకర పొగ నేరుగా శరీరంలోకి వెళ్తుంది (one puff cigarette harm). అంటే ఒక్క పఫ్‌తో శరీరం తట్టుకోలేని స్థాయిలో విషపదార్థాలు లోపలికి చేరిపోతాయి. మొదటి పఫ్ నుంచే శరీరం దెబ్బతినే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ వీడియో ద్వారా చూపించారు. ఒక్క పఫ్‌తో ఏమవుతుందిలే అనుకునేవారికి.. నష్టం వెంటనే మొదలవుతుందని ఈ వైరల్ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి
మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..