Lion hunt: వామ్మో.. సింహానికి ఈ ట్యాలెంట్ కూడా ఉందా? పొదల్లో దాక్కున్న దున్నను ఎలా పట్టిందో చూడండి..
ABN , Publish Date - Sep 24 , 2025 | 08:38 AM
అడవికి దాని స్వంత ప్రత్యేక నియమం ఉంటుంది. అక్కడ బలవంతులు మాత్రమే బతుకుతారు. బలవంతులకు ఆకలేస్తే బలహీనులు ఆహారం కావాల్సిందే. బలహీనులు అనుక్షణం, అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే ఆ రోజుతో వాటికి ఆయువు మూడినట్టే.
అడవికి దాని స్వంత ప్రత్యేక నియమం ఉంటుంది. అక్కడ బలవంతులు మాత్రమే బతుకుతారు. బలవంతులకు ఆకలేస్తే బలహీనులు ఆహారంగా మారిపోవాల్సిందే. బలహీనులు అనుక్షణం, అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే ఆ రోజుతో వాటికి ఆయువు మూడినట్టే. వన్య ప్రాణులకు సంబంధించిన ఎన్నో వేట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో సింహం ట్యాలెంట్ చూస్తే ఫిదా కావాల్సిందే (Jungle story).
@manja_kema అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో (wildlife chase) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ఓ సింహం వేటాడడానికి ప్రయత్నిస్తోంది. సింహాన్ని చూసిన ఓ అడవి దున్న పొదల్లో దాక్కుంది. సింహం అక్కడకు వచ్చి జాగ్రత్తగా పరిశీలించింది. సింహాలు ఇతర జంతువుల పాద ముద్రలనే కాకుండా వాటి వాసననను కూడా గుర్తించగలవు. తాజా వీడియోలో సింహం అడవి దున్న వాసనను పసిగట్టి అది ఉన్న వైపు దూకింది. ఆ దున్న అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు (lion vs Wild buffalo).
సింహానికి దొరికిపోయిన దున్న.. చివరకు ప్రాణాలను కోల్పోయింది (animal hunting story). ఆ వీడియో సోషల్ మీడియలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను 41 లక్షల మందికి పైగా వీక్షించారు. లక్ష మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. సింహం చాకచక్యం, ఓర్పు, వాసన చూసే శక్తి అద్భుతం అని ఒకరు కామెంట్ చేశారు. అడవిలో మనుగడ బలం మీద మాత్రమే కాకుండా తెలివి మీద కూడా ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌లో ఐఫోన్ రేటెంతో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కిడ్నీ అమ్మినా కుదరదేమో..
మీ కళ్లకు పవర్ ఉంటే.. ఈ అడవిలో చిరుతను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..