Share News

Wife and Husband: భార్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.. అత్తారింటి ముందు టీ దుకాణం పెట్టాడు..

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:52 PM

ఆ వ్యక్తి పేరు కృష్ణ కుమార్ ధకాడ్.. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలోని అథానా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ గతంలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు.. 2018లో అతడు వివాహం చేసుకున్నాడు.. తర్వాతి ఏడాది భార్యతో కలిసి తేనె టీగల పెంపకం ప్రారంభించాడు.. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు..

Wife and Husband: భార్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.. అత్తారింటి ముందు టీ దుకాణం పెట్టాడు..
Tea Stall

ఆ వ్యక్తి పేరు కృష్ణ కుమార్ ధకాడ్.. మధ్యప్రదేశ్‌ (Madhyapradesh)లోని నీముచ్ జిల్లాలోని అథానా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ గతంలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు.. ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేశాడు.. 2018లో అతడు వివాహం చేసుకున్నాడు.. తర్వాతి ఏడాది భార్యతో కలిసి తేనె టీగల పెంపకం ప్రారంభించాడు.. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.. 2021లో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కృష్ణకుమార్‌‌ను ప్రశంసించారు.. అయితే 2022లో కృష్ణకుమార్ జీవితం మలుపు తిరిగింది. అతడి భార్య అతడిని వదిలేసింది (Viral News).


కృష్ణకుమార్ భార్య 2022లో అతడితో గొడవపడి విడిపోవడమే కాకుండా అతడిపై తప్పుడు కేసులు పెట్టింది. వరకట్న వేధింపుల కేసు, గృహ హింస కేసు పెట్టింది. దీంతో కృష్ణకుమార్‌కు కష్టాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి అతడు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. చివరకు తన భార్య లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. చాలా మంది మహిళలు గృహ హింస చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. అత్తారింటి ముందు టీ దుకాణం (Tea Stall) తెరిచాడు.


ఐపీసీ సెక్షన్ 498A కింద తన భార్య తనపై కేసు పెట్టడంతో అదే పేరును తన టీ దుకాణానికి పెట్టాడు. ఆ టీ స్టాల్‌లో అతడు చేతికి సంకెళ్లు వేసుకుని టీ తయారు చేస్తాడు. దుకాణం వెలుపల ఉన్న హోర్డింగ్‌లపై న్యాయం దొరికే వరకు టీ మరుగుతూనే ఉంటుంది అని రాసి ఉంది. తన భార్య చేసిన పని వల్ల తాను మానసికంగా, సామాజికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని, కానీ తన వృద్ధ తల్లి కోసం ఆ ఆలోచనను విరమించుకున్నానని కృష్ణ కుమార్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆ కొంగకు ఎంత ధైర్యం.. పులులతో పోరు.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..


Piggy Bank: అదృష్టం ఇలా కూడా వరిస్తుందా.. బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 04:52 PM