Umbrella on railway track: రైలు పట్టాలపై గొడుగుతో నడవకూడదా.. కారణం ఏంటో తెలిస్తే..
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:33 PM
వర్షం పడుతున్న సమయంలో రైలు పట్టాలపై గొడుగు పట్టుకుని నడవకూడదా? అలా నడిస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందా? అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. గొడుగు పట్టుకుని ఎప్పుడూ రైలు పట్టాలపై నడకూడదంటున్నారు. అలా నడిస్తే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
వర్షం పడుతున్న సమయంలో రైలు పట్టాలపై గొడుగు పట్టుకుని నడవకూడదా? అలా నడిస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందా? అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. గొడుగు పట్టుకుని ఎప్పుడూ రైలు పట్టాలపై నడవకూడదంటున్నారు. రైలు ట్రాక్‌లపై నడుస్తున్నా, పట్టాలను దాటుతున్న సమయంలోనూ లోహ వస్తువులను, మెటల్ ఫ్రేమ్ ఉన్న గొడుగులను అసలు ఉపయోగించకూడదట (railway track danger).
రైలు పట్టాలకు సమీపంలో మెటల్ ఫ్రేమ్ ఉన్న గొడుగు ఉపయోగించడం హై వోల్టేజ్ విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందట. ప్రస్తుతం మన దేశంలో చాలా రైళ్లు విద్యుత్ ఆధారంగానే నడుస్తున్నాయి. రైలు పట్టాలకు సమీపంలో హై వోల్టేజ్ ఓవర్ హెడ్ వైర్లు ఉంటాయి. ఆ వైర్ల గుండా 25 వేల వోల్ట్స్ విద్యుత్ ప్రవహిస్తుంటుంది. ఆ వైర్ల ద్వారా రైలు ఇంజిన్లకు విద్యుత్ ప్రసారం అవుతుంది. ఆ విద్యుత్ ప్రత్యేక వ్యవస్థ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటుంది. సాధారణంగా అది ఎవరికీ హానీ కలిగించదు (railway safety awareness).
ఒక్కోసారి విద్యుత్తు భూమిని తిరిగి చేరినప్పుడు ట్రాక్ కూడా ప్రభావితమవుతుంది. మనుషులు దాని మీద నడిచినపుడు కూడా సాధారణంగా ఎలాంటి ప్రభావమూ కనిపించదు. అయితే చేతిలో ఏదైనా లోహ సంబంధిత వస్తువులు ఉన్నప్పుడు మాత్రం తీవ్ర ప్రమాదాలు సంభవిస్తాయి. తాజాగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై గొడుగు పట్టుకుని నడుస్తున్న సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది వీడియో చిత్రీకరించి చూపించాడు (viral video). అతడి చేతికి షాక్ కొట్టినట్టు చెప్పాడు. గొడుగు మాత్రమే కాదు.. ఐరన్ రాడ్లు, ఐరన్ తీగలతో కూడా వస్తువులను కూడా రైల్వే ట్రాక్‌కు సమీపంలో తీసుకెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Cream biscuits: మీ పిల్లలు ఎక్కువగా క్రీమ్ బిస్కెట్లు తింటుంటారా.. ముందు ఈ విషయం తెలుసుకోండి..
Optical Illusion Test: మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ గదిలో దాక్కున్న కప్పను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..