Iran red beach mystery: ఇరాన్‌లో రక్తపు వర్షం.. ఎరుపెక్కిన సముద్రం.. ఆసక్తికర కారణమేంటంటే..
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:27 PM
ఇరాన్‌లోని హార్ముజ్ ద్వీపం మరోసారి దాని అద్భుతమైన అందంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇటీవలి భారీ వర్షాల కారణంగా హార్ముజ్ ద్వీపంలోని బీచ్‌లు, సముద్ర తీరాలు ఎరుపు రంగులోకి మారాయి. రక్తంతో నిండిపోయినట్టు కనిపిస్తున్నాయి.
ఇరాన్‌లోని హార్ముజ్ ద్వీపం మరోసారి దాని అద్భుతమైన అందంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇటీవలి భారీ వర్షాల కారణంగా హార్ముజ్ ద్వీపంలోని బీచ్‌లు, సముద్ర తీరాలు ఎరుపు రంగులోకి మారాయి. రక్తంతో నిండిపోయినట్టు కనిపిస్తున్నాయి. అత్యంత వింతగా, భయంకరంగా కనిపించే ఈ ఎరుపు రంగు వాస్తవానికి సహజమైనది, పూర్తిగా సురక్షితమైనది. ఈ ప్రాంతం ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం కలిగి ఉండడమే దీనికి కారణం (raining blood Iran).
పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న హార్ముజ్ ద్వీపం రంగురంగుల స్థలాకృతి, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నేల, పర్వతాలు ఐరన్ ఆక్సైడ్‌తో, ముఖ్యంగా హెమటైట్ అనే ఖనిజంతో నిండి ఉంటాయి. హెమటైట్ (Fe2O3) అనేది భూమిపై ఎరుపు రంగును ఉత్పత్తి చేసే సహజ ఐరన్ ఆక్సైడ్. ఈ ఖనిజం వల్లే అంగారక గ్రహం ఉపరితలం కూడా ఎర్రగా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు, నీరు ఈ హెమటైట్ అధికంగా ఉండే పర్వతాలు, నేల గుండా ప్రవహించి ఎర్రగా మారుతుంది (beach turned red Iran).
ఈ నీరు సముద్రంలోకి ప్రవహించడం వల్ల సముద్రపు నీరు, బీచ్‌లోని ఇసుక ఎరుపు రంగులోకి మారుతాయి (blood rain phenomenon). హోర్ముజ్ ద్వీపంలోని నేల, రాళ్లు వివిధ ఖనిజాలతో కూడి ఉంటాయి. ఈ నేలలో ఓచర్, జిప్సం, ఇనుప ఖనిజం సమృద్ధిగా ఉంటాయి. ఈ రంగులు స్థానికంగా సాంస్కృతిక చిహ్నాలుగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా తోడ్పాటునందిస్తున్నాయి. పర్యాటకులు, శాస్త్రవేత్తలు ఈ సహజ రంగు అద్భుతాన్ని వీక్షించడానికి తరలి వస్తారు.
ఇవి కూడా చదవండి..
హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..