Papad making Shock: వామ్మో.. అప్పడాలను ఇలా చేస్తారా? వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:17 AM
చాలా మంది భారతీయులు అప్పడాలను ఎంతో ఇష్టంగా తింటారు. డైనింగ్ టేబుల్ మీద ఎన్ని వంటకాలున్నా అప్పడాలు లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతారు. ముఖ్యంగా తెలుగువారికి అప్పడాలంటే మరింత ఇష్టం. పప్పు అయినా, సాంబార్ అయినా అప్పడాలతో తింటే మరింత రుచిగా అనిపిస్తాయి.
చాలా మంది భారతీయులు అప్పడాలను ఎంతో ఇష్టంగా తింటారు. డైనింగ్ టేబుల్ మీద ఎన్ని వంటకాలున్నా అప్పడాలు లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతారు. ముఖ్యంగా తెలుగువారికి అప్పడాలంటే మరింత ఇష్టం. పప్పు అయినా, సాంబార్ అయినా అప్పడాలతో తింటే మరింత రుచిగా అనిపిస్తాయి. అయితే ఎంతో మంది ఇష్టపడే అప్పడాలను తయారు చేస్తున్న తీరు చూస్తే మాత్రం అసహ్యం వేయక మానదు (Traditional papad making).
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అప్పడాలను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే నివ్వెరపోక తప్పదు (Indian snack trends). aapka_food_vlogs_09 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ముందుగా ఒక మహిళ పాపడ్ తయారీకి మసాలా కలిపిన పిండిని ఒక గ్లాసులోకి తీసుకుంటోంది. దానిని ఓ స్టవ్ మీద పెట్టిన ఓ పెద్ద ప్లేట్‌పై రాస్తోంది. కాసేపటికి ఆ పిండి ఒక పెద్ద పొరలా మారుతోంది. అలాంటి ఎన్నో పొరలను కలిపి ఎండబెడుతున్నారు (Papad hygiene issues).
అవి ఎండిన తర్వాత ఒక పెద్ద ప్లేట్‌పై పెట్టి ఒక చిన్నె గొన్నెతో గుండ్రంగా కట్ చేస్తున్నారు. అయితే అలా కట్ చేయడం కోసం ఓ వ్యక్తి ఆ పొరల మీద కాలితో తొక్కుతున్నాడు (Foodies reject papad). కొన్ని సార్లు ఆ పొరల మీద పాదాలను కూడా పెట్టేస్తున్నాడు. ఆ తర్వాత వాటిని కాసేపు ఎండబెట్టి ప్యాక్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారు అసహ్యించుకుంటున్నారు. ఈ రోజు నుంచి అప్పడాలు తినడం మానేస్తానని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
చిరుత పవర్ చూశారా? నీటిలోకి దూకి మొసలిని ఏం చేసిందో చూడండి..
ఈ ఫొటోలో చిలుక మాత్రమే కాదు.. బాటిల్ కూడా ఉంది.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..