10:10 time meaning: కొత్త వాచ్‌లు, గోడ గడియారాలపై టైమ్ ఎక్కువగా 10:10 ఎందుకుంటుంది.. కారణమేంటి..
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:29 AM
మీరు కొత్త వాచ్‌లు, గడియారాలను చూసినపుడు లేదా వాచ్‌ల ప్రకటనలు చూసినపుడు ఓ విషయం గమనించే ఉంటారు. ఆ వాచ్‌లు, గడియారాల్లో టైమ్ 10:10 అని కనబడుతుంటుంది. పెద్ద పెద్ద వాచ్‌లు, గడియారాల దుకాణాల్లో కూడా 10:10 సమయం కనిపించేలా డిజైన్లు ఉంటాయి.
మీరు కొత్త వాచ్‌లు, గోడ గడియారాలను చూసినపుడు లేదా వాచ్‌ల ప్రకటనలు చూసినపుడు ఓ విషయం గమనించే ఉంటారు. ఆ వాచ్‌లు, గడియారాల్లో టైమ్ 10:10 అని కనబడుతుంటుంది. పెద్ద పెద్ద వాచ్‌లు, గడియారాల దుకాణాల్లో కూడా 10:10 సమయం కనిపించేలా డిజైన్లు ఉంటాయి. అన్నింట్లోనూ అదే టైమ్ చూపించడానికి గల కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా. అసలు, దీని వెనుకున్న నిజమైన కారణమేంటో ఎవరికీ తెలియదు (why watches set at 10:10).
చాలా గడియారాల్లో టైమ్ 10:10కి సెట్ చేసి ఉంచడానికి కొన్ని కారణాలు వినబడుతుంటాయి. గడియారంలో టైమ్ 10:10కి సెట్ చేసి ఉంచినపుడు అది విక్టరీ సింబల్ 'V'ని సూచిస్తుంది. ఇది విజయాన్ని సూచిస్తుంది. అలాగే గడియారం ముళ్లు ఈ ఆకారంలో ఉనప్పుడు మధ్యలో ఉన్న కంపెనీ పేరు హైలెట్ అవుతుంది. అలాగే గడియారంలో ముళ్లు ఇలా ఉనప్పుడు చూసే వారికి అది చిరునవ్వులా కూడా కనిపిస్తుందట. అందుకే చాలా గడియారల్లో ఆ టైమ్ సెట్ చేసి ఉంచుతారట (watch display mystery).
పైన చెప్పినవి మాత్రమే కాకుండా, మరికొన్ని నమ్మలేని కారణాలు కూడా ఉన్నాయట (unknown reason 10:10). అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ 10:10 గంటలకు మరణించారని, అందుకే గడియారాలను 10:10కి సెట్ చేస్తారని మరొక కారణం కూడా ఉంది. ఇక, హిరోషిమా, నాగసాకిపై అణు బాంబులు వేసిన సమయం 10:10 అని, అందుకే గడియారాలను 10:10కి సెట్ చేస్తారని మరొక విశ్లేషణ ఉంది. అయితే ఈ రెండు కారణాలు నిజం కాదు. ఎందుకంటే ఆ రెండు ఘటనలు 10:10 గంటలకు జరగలేదు.
ఇవి కూడా చదవండి..
వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. పక్షుల మధ్య సీతాకోక చిలుకను 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..