Share News

Desi Jugaad: ఈ వ్యక్తి తెలివి చూస్తే.. ఎలక్ట్రీషియన్‌లు కూడా షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:10 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ తెలివి ఉపయోగించి చేసే జుగాడ్‌కు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Desi Jugaad: ఈ వ్యక్తి తెలివి చూస్తే.. ఎలక్ట్రీషియన్‌లు కూడా షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్
unbelievable Idea

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ తెలివి ఉపయోగించి చేసే జుగాడ్‌కు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (intelligent jugaad).


trendy__londaa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. సాధారణంగా కరెంట్ స్థంభాలకు బల్బులను అమర్చడం కాస్త కష్టమైన పని. స్థంభాల పైకి ఎక్కి కనెక్షన్ ఇస్తే తప్ప బల్బు వెలగదు. అయితే ఈ సమస్యకు ఓ వ్యక్తి అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి విద్యుత్ తీగలకు లాంతరును కర్ర సహాయంతో తగిలించాడు. ఆ లాంతరుకు ఉన్న రెండు వైర్లను రెండు వేర్వేరు విద్యుత్ తీగలకు కలిపాడు (unbelievable talent).


ఆ వైర్లను కలిపిన వెంటనే లాంతరు వెలిగింది (trending video). ఆ వ్యక్తి లాంతరు లోపల ఒక బల్బును అమర్చి ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ తీగలకు నేరుగా కనెక్ట్ చేశాడు. చాలా సులభంగా పని పూర్తి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఇది బీహార్ అని, ఏదైనా జరగవచ్చని ఒకరు కామెంట్ చేశారు. అక్కడ ఆర్జేడీ ప్రమోషన్ జరుగుతోందని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇతడి తెలివి చూస్తే నవ్వుకోవాల్సిందే.. ట్రాఫిక్ చలానా తప్పించుకునేందుకు సూపర్ ట్రిక్..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ Qల మధ్యనున్న Oను 9 సెకెన్లలో కనిపెట్టండి..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 03 , 2025 | 03:26 PM