Elephant vs lions: షాకింగ్.. ఏనుగును చూసిన సింహాల గుంపు ఏం చేసిందంటే..
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:31 PM
అడవికి రారాజు సింహం (Lion) అనుకుంటాం. సింహం తలచుకుంటే అడవిలోని ఏ జంతువునైనా చంపగలదని నమ్ముతాం. సింహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ భయపడతాయనుకుంటాం. అయితే అప్పుడప్పుడు మన అంచనాలకు విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది.
సాధారణంగా అడవికి రారాజు సింహం (Lion) అనుకుంటాం. సింహం తలచుకుంటే అడవిలోని ఏ జంతువునైనా చంపగలదని నమ్ముతాం. సింహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ భయపడతాయనుకుంటాం. అయితే అప్పుడప్పుడు మన అంచనాలకు విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగును చూసి సింహాలు పారిపోయాయి (Elephant charges lions).
@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొన్ని సింహాలు తమ పిల్లలతో కలిసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి (lions under tree). అక్కడికి ఓ భారీ ఏనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది. మెల్లిగా ఆ చెట్టు దగ్గరకు చేరుకున్న ఏనుగు.. సింహాలను చూసి పెద్దగా గర్జించింది. దీంతో ఆ చెట్టు కింద ఉన్న సింహాలు భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఓ ఏనుగును చూసి సింహాలు అలా పారిపోవడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. (unexpected wildlife moment).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (predator vs giant). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 36 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అడవి రాజుకు ఇప్పుడు భద్రత అవసరమని అనిపిస్తుందని ఒకరు కామెంట్ చేశారు. అడవికి నిజమైన రాజు ఏనుగని మరొకరు పేర్కొన్నారు. సింహాలు తమ శక్తిని తెలుసుకోలేవని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..