Titanic: టైటానిక్ మునిగిపోతున్నప్పుడు కూడా భారతీయులు ఆ పనే చేస్తారట.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
ABN , Publish Date - May 29 , 2025 | 06:42 PM
భారతీయులు ఎక్కువగా ఇష్టపడే పానీయం టీ. వయసుతో తేడా లేకుండా చాలా మంది టీ తాగుతూ ఉంటారు. చాలా మందికి టీ అనేది కేవలం పానీయం కాదు, అది ఒక భావోద్వేగం. సీజన్, సమయంతో సంబంధం లేకుండా చాలా మంది టీని ఆస్వాదిస్తూ ఉంటారు.
భారతీయులు (Indians) ఎక్కువగా ఇష్టపడే పానీయం టీ (Tea). వయసుతో తేడా లేకుండా చాలా మంది టీ తాగుతూ ఉంటారు. చాలా మందికి టీ అనేది కేవలం పానీయం కాదు, అది ఒక భావోద్వేగం. సీజన్, సమయంతో సంబంధం లేకుండా చాలా మంది టీని ఆస్వాదిస్తూ ఉంటారు. పని, చదువు, ఒత్తిడి, తలనొప్పి, అనారోగ్యం, వేడుక.. ఇలా ఏదైనా టీ ఉండాల్సిందే. భారతీయులు టీ పట్ల ఉన్న మక్కువ గురించి విదేశీయులు చాలా కామెంట్లు చేస్తున్నారు (Viral Video).
ఇండియన్స్‌కు టీ అంటే ఎంతిష్టమో వర్ణిస్తూ ఓ విదేశీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ మీమ్‌ను రూపొందించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి రూపొందించిన ఆ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైటానిక్‌లో భారతీయులు ఉంటే అది మునిగిపోతున్న సమయంలో వారు ఏం చేసేవారో చూపించేందుకు ఆ వీడియో రూపొందించాడు. టైటానిక్ పూర్తిగా నీటితో నిండిపోయిన సమయంలో కూడా భారతీయులు టీ తాగుతారని ఫన్నీగా చూపించాడు.
మెడ వరకు నీటిలో ఉన్న సమయంలో కూడా వారు బయటకు వచ్చి టీ తాగుతారనేది అతడి అభిప్రాయం. ఓడ మునిగిపోయే ముందు భారతీయులు తమ చివరి కప్పు టీ తాగి ఉండేవారనే వాస్తవాన్ని సరదాగా చిత్రీకరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది నిజమేనంటూ చాలా మంది ఆ వీడియోపై కామెంట్లు చేశారు. మరికొందరు సరదాగా స్పందించారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్
మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..