Share News

Unique wedding card: ఇది ఆధార్ కార్డ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఏంటో తెలిస్తే షాక్..

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:40 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఆలోచించి చేసే జుగాడ్‌కు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.

Unique wedding card: ఇది ఆధార్ కార్డ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఏంటో తెలిస్తే షాక్..
funny wedding card

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఆలోచించి చేసే జుగాడ్‌కు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లి ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (creative wedding invitation).


@RealTofanOjha అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కవర్ లోపలి నుంచి ఓ కార్డును బయటకు తీశాడు. చూడడానికి అది పూర్తిగా ఆధార్ కార్డులా ఉంది. అయితే ఆధార్ కార్డ్ కాదు. ఆధార్ కార్డ్‌ను పోలి ఉండేలా రూపొందించిన ఇన్విటేషన్ కార్డు. ఆధార్ కార్డు మాదిరిగానే పొడవు, వెడల్పు, డిజైన్‌తో ఆ శుభలేఖను రూపొందించారు. ఆధార్ కార్డ్ మీద వ్యక్తి ఫొటో ఉండే చోట వధూవరుల ఫొటోలు ఉన్నాయి (viral wedding idea).


ఈ విచిత్రమైన వెడ్డింగ్ కార్డ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (trending wedding card). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఓ మై గాడ్, ఈ వ్యక్తి గొప్ప కళాకారుడిలా ఉన్నాడని ఒకరు కామెంట్ చేశారు. ఇది సూపర్ వెడ్డింగ్ కార్డు అని మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 09 , 2025 | 11:46 AM