Bride rejects marriage: పెళ్లి మండపంలో వరుడి ఓవరాక్షన్.. కోలుకోలేని షాకిచ్చిన వధువు..
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:54 PM
ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మన దేశంలోని కొన్ని ఆచారాలు మాత్రం సమసిపోవడం లేదు. ఇప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెళ్లిళ్ల సమయంలో కట్నం ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కట్నం కోసం వరుడి కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులను వేధిస్తూనే ఉన్నారు.
ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మన దేశంలోని కొన్ని ఆచారాలు మాత్రం సమసిపోవడం లేదు. ఇప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెళ్లిళ్ల సమయంలో కట్నం ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కట్నం కోసం వరుడి కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం రాత్రి ఓ షాకింగ్ ఘటన జరిగింది. కల్యాణ మండపంలో వరుడి ఓవరాక్షన్ చూసి వధువుకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆమె వెంటనే పెళ్లిని రద్దు చేసుకుంది (wedding cancelled UP).
బరేలీలోని సదర్ బజార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో వరుడు రిషబ్ వధువు కుటుంబ సభ్యులను చివరి నిమిషంలో టెన్షన్ పెట్టాడు. మరికొన్ని నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా ప్లేటు ఫిరాయించాడు. వరుడు రిషబ్ తనకు ఉన్నపలంగా బ్రెజ్జా కారు, రూ. 20 లక్షల నగదు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వెంటనే ఇవ్వకపోతే పెళ్లిని రద్దు చేసుకుంటానని బెదిరించాడు. వధువు కుటుంబ సభ్యులు ఎంతగా బతిమాలుకున్నా రిషబ్ దిగిరాలేదు (groom dowry demand).
చివరకు ఈ వ్యవహారం వధువు ఇంద్రపాల్‌కు తెలిసింది (20 lakh dowry demand). దీంతో ఆమె ఆ దురాశపరుడితో జీవితం పంచుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు అందరి ముందు ప్రకటించింది. దీంతో కల్యాణ మండపంలో గొడవ మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వరుడిని, అతడి తండ్రిని, బావను అదుపులోకి తీసుకున్నారు.
'నా తండ్రిని, సోదరుడిని కట్నం కోసం అతిథులందరి ముందు అవమానించాడు. భవిష్యత్తులో నన్ను ఎలా గౌరవిస్తాడు? అలాంటి దురాశపరుడిని వివాహం చేసుకోలేను' అని వధువు చెబుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..
మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..