Watering in Rain: మెదడు ఎక్కడుందో మరి.. వర్షంలో కూడా మొక్కలకు నీళ్లు పోస్తున్న సిబ్బంది..
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:36 PM
సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మొక్కలకు ప్రత్యేకంగా ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి వేస్తుంటారు. నగరంలో పచ్చదనాన్ని కాపాడేందుకు అలా చేస్తారు. అయితే వర్షం వచ్చినప్పుడు కూడా అలా మొక్కలకు నీరు వేయాల్సిన అవసరం లేదు. ఆ విషయం చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది.
కొందరు వ్యక్తులు ఏ మాత్రం ఆలోచించకుండా పనులు చేస్తుంటారు. అసలు ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో కూడా ఆలోచించకుండా గుడ్డిగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతారు. సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మొక్కలకు ప్రత్యేకంగా ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి వేస్తుంటారు. నగరంలో పచ్చదనాన్ని కాపాడేందుకు అలా చేస్తారు (Watering trees). అయితే వర్షం (Rain) వచ్చినప్పుడు కూడా అలా మొక్కలకు నీరు వేయాల్సిన అవసరం లేదు. ఆ విషయం చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది.
@prap_India అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన ఓ వీడియో (Viral Video) చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం చూస్తే వారి పనితీరు సమగ్రంగా అర్థమవుతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. భోపాల్‌లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. అలాంటి సమయంలో కూడా భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ (Bhopal Municipal Corporation) సిబ్బంది నీళ్ల ట్యాంకర్‌ను రోడ్డు మీద నిలిపి మొక్కలకు నీరు వేస్తున్నారు. వారి నిర్వాకాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వారికి తమ పని పట్ల ఎంత డెడికేషన్ ఉందో అర్థమవుతోందని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. భోపాల్‌లో పచ్చదనానికి కారణం ఇదే అనుకుంటా అంటూ మరొకరు పేర్కొన్నారు. వర్షం పడుతుండగా మళ్లీ ప్రత్యేకంగా నీరు వేయడం ఏంటో నాకు అర్థం కాలేదని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వేదిక మీద గిఫ్ట్ ఇచ్చిన వరుడు.. కుప్పకూలిన వధువు సోదరి.. కారణమేంటంటే..
మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ ఏనుగుల మధ్యలోనున్న రైనోను 5 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..