Aunty stealing from shop: ఆంటీ.. ఈ పని ఏంటి.. ఎంత సైలెంట్‌గా ఓ వస్తువును కొట్టేసిందో చూడండి..
ABN , Publish Date - Jul 08 , 2025 | 09:39 AM
ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు చాలా సైలెంట్‌గా దొంగతనానికి పాల్పడుతున్నారు. అయితే ఓ వ్యక్తి తన ఇంటి బాల్కనీ నుంచి ఆ ఘటనను రికార్డు చేశాడు.
ఎవరికీ తెలియకుండా మనం చేసే చెడ్డ పనులన్నింటినీ దేవుడు చూస్తాడని అంటుంటారు. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎవరేం చేస్తున్నా కెమెరాలు పట్టేస్తున్నాయి. వారి తప్పులను ఎత్తి చూపి నడిరోడ్డులో నిలబెట్టేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు చాలా సైలెంట్‌గా దొంగతనానికి (Theft) పాల్పడుతున్నారు. అయితే ఓ వ్యక్తి తన ఇంటి బాల్కనీ నుంచి ఆ ఘటనను రికార్డు చేశాడు.
skipz_gg అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఒక స్టాల్ పెట్టుకుని కొన్ని సామాన్లు అమ్ముకుంటున్నాడు. అక్కడ కొంతమంది మహిళలు వస్తువులు కొనడానికి నిలబడి ఉన్నారు. అయితే ఇద్దరు మహిళలు చాకచక్యంగా చోరీ చేస్తున్నారు. ఒక మహిళ స్టాల్ నుంచి వస్తువు తీసుకొని తన వెనుక నిలబడి ఉన్న మరొక మహిళకు అందజేస్తోంది. ఆ మహిళ దానిని తన బ్యాగ్‌లో పెట్టేసుకుంది. అలా రెండుసార్లు చేసినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
వారి చేష్టలను సమీపంలోని ఇంటి బాల్కనీపై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 12 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆంటీగారూ.. పైన ఉన్నవాడు ప్రతిదీ చూస్తున్నాడు అని ఒకరు కామెంట్ చేశారు. ఆ రెండు బ్యాగ్‌లను అలాగే నింపేశారేమో అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
తాగేసి పడిపోయిన యజమాని.. ఎద్దు అతడిని ఇంటికి ఎలా తీసుకెళ్తోందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో 99ల మధ్యనున్న 96ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..