Unexpected twist: ఇతడి నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే.. చివర్లో సూపర్ ట్విస్ట్..
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:27 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. తాజాగా అలాంటిదే మరో ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది (must-watch video).
goga_ga_ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాధారణంగా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు వికాలాంగులు భిక్షాటన చేయడానికి వస్తుంటారు. చాలా మంది వారి పరిస్థితి చూసి జాలిపడి డబ్బులు ఇస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి రైలు బోగీలో కింద పాకుతూ డబ్బులు అడుక్కుంటున్నాడు. అలా అందరినీ అడుగుతూ కోచ్ చివరకు వచ్చేశాడు. అయితే అతడు రైలు కోచ్ దిగిన వెంటనే, తన కాళ్లపై హాయిగా నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది (surprise ending).
అతడు కేవలం డబ్బులు అడుక్కోవడం కోసమే వికలాంగుడిగా నటించాడు (dramatic twist). ఒకరు అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. 29 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వీరు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని ఒకరు కామెంట్ చేశారు. అతడు గొప్ప నటుడిగా ఎదుగుతాడని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ వాచ్‌మెన్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటే.. స్ఫూర్తివంతమైన స్టోరీ..
మీ సమర్థతకు పరీక్ష.. 78ల మధ్యనున్న 87ను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..