Jugaad Trick: వావ్.. మామిడి పళ్లను ఇలా కూడా కొయ్యొచ్చా.. ఆ వ్యక్తి తెలివికి సలాం కొట్టాల్సిందే
ABN , Publish Date - May 11 , 2025 | 09:12 PM
మనదేశంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అమోఘమైన తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. ఎంత కష్టమైన పనిని అయినా సులభంగా పూర్తి చేసే ట్రిక్‌లను కనుగొంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మనదేశంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అమోఘమైన తెలివితేటలు (Intelligence) ప్రదర్శిస్తుంటారు. ఎంత కష్టమైన పనిని అయినా సులభంగా పూర్తి చేసే ట్రిక్‌లను కనుగొంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని ఓ వ్యక్తి మామిడికాయలు (Mangoes) తెంపడానికి మంచి ట్రిక్ (Trick) ఉపయోగించాడు.
prameelafoodforever అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ వ్యక్తి ఖాళీ వాటర్ బాటిల్‌ను ఉపయోగించి సునాయాసంగా మామిడి కాయలను తెంపేస్తున్నాడు. సాధారణంగా చెట్టు మీద మామిడి కాయలను కర్రతో కొడితే అవి కింద పడిపోయి దెబ్బతింటాయి. అలాంటి ప్రమాదం లేకుండా ఓ వ్యక్తి ఖాళీ వాటర్ బాటిల్‌ను మామిడి కాయను కట్ చేసి కింద పడకుండా పట్టుకునేలా కట్ చేశాడు. ఆ సీసాను ఓ కర్రకు కట్టి దాంతో మామిడికాయలను సులభంగా కట్ చేసేస్తున్నాడు.
ఆ జుగాడ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు. 1.3 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ టెక్నాలజీ బయటకు వెళ్లకూడదంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Indian Army: భోజనం కోసం ఓ దాబా దగ్గరకు వచ్చిన ఆర్మీ.. స్థానిక ప్రజలు ఏం చేశారో చూడండి..
Optical Illusion Test: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ పార్క్‌లో కొవ్వొత్తి ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..