Share News

Lion Video: వామ్మో.. సింహాన్ని రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలుసా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:30 PM

సింహం అంటే అడవికి రారాజు. సింహానికి ఎదురువెళ్లడానికి మహా క్రూర మృగాలే భయపడతాయి. ఇక, మనుషులు అయితే సింహాన్ని చూస్తేనే వణికిపోతారు. సింహం బోనులో ఉన్నా సరే దానితో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికి కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం.

Lion Video: వామ్మో.. సింహాన్ని రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలుసా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
Lion Viral Video

సింహం (Lion) అంటే అడవికి రారాజు. సింహానికి ఎదురువెళ్లడానికి మహా క్రూర మృగాలే భయపడతాయి. ఇక, మనుషులు అయితే సింహాన్ని చూస్తేనే వణికిపోతారు. సింహం బోనులో ఉన్నా సరే దానితో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికి కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Lion Video) ఓ వ్యక్తి బోనులో ఉన్న సింహాన్ని టీజ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@Anselem_D అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక సింహం బోనులో బందీ అయి ఉంది. ఒక వ్యక్తి ఆ బోను తలుపు తెరిచి సింహం ముందు మాంసం ముక్కలను విసిరాడు. ఆ తర్వాత తన చేతితో చిటికెలు వేస్తూ సింహాన్ని టీజ్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ సింహం ఆగ్రహానికి గురైంది. అప్పుడు ఆ సింహం గాండ్రిస్తూ అతని వైపు దూసుకు వచ్చింది. కానీ ఆ వ్యక్తి వెంటనే బోను తలుపు మూసివేశాడు. దీంతో ఆ సింహం కోపంగా అరుస్తూ ఉండిపోయింది.


ఆ ఘటనకు సంబంధించిన వీడియోను రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందనలను తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్

మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 03:30 PM