Goats hit by train: కళ్ల ముందే దారుణం.. వేగంగా వస్తున్న రైలు కింద మేకలు ఎలా నలిగిపోయాయో చూడండి..
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:14 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ విషాదభరిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ విషాదభరిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొన్ని మూగ జీవాలు వేగంగా వస్తున్న రైలు కిందకు పరిగెత్తి ప్రాణాలు కోల్పోయాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (train kills livestock).
సౌత్ సౌత్ అనే ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ప్రజలు రైల్వే స్టేషన్ పట్టాలను దాటుతున్నారు. ఆ సమయంలో దూరం నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు హారన్ బిగ్గరగా వినబడింది. రైలు అధిక వేగంతో వస్తోంది. ప్రజలు ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉండిపోయారు. అయితే అదే సమయంలో కొన్ని మేకలు ప్లాట్‌ఫారమ్ నుంచి పట్టాల పైకి దూకి పరిగెత్తాయి. వేగంగా వస్తున్న రైలు పట్టాలపై ఉన్న ఆ మేకలను ఢీకొట్టింది (grazing animals on track).
ఆ రైలు కింద మేకలు నలిగిపోయాయి (Indian Railways incidents). రైలు వెళ్లిపోయిన తర్వాత ఆ పట్టాలు రక్తసిక్తంగా మారిపోయాయి. ఈ దృశ్యం చాలా భయంకరంగా మారిపోయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను వేల మంది వీక్షించారు. ఆ మేకల మరణంపై చాలా మంది బాధపడ్డారు. ఎవరో పేదవాడు తన మేకలను పోగొట్టుకున్నాడని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఒంటెకు ఇంత కోపం వస్తుందా.. డిస్ట్రబ్ చేసిన కుర్రాళ్లను ఏం చేసిందో చూడండి..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలోని ఉడతను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..