Share News

Bride Viral Video: వేదిక మీదే వధూవరుల మధ్య గొడవ.. అసలేం జరిగిందో తెలుసా

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:41 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఆసక్తికర ఘటనలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వివాహ వేదిక మీద వధూవరుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Bride Viral Video: వేదిక మీదే వధూవరుల మధ్య గొడవ.. అసలేం జరిగిందో తెలుసా
Bride and Groom

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఆసక్తికర ఘటనలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వివాహ వేదిక మీద వధూవరుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం చాలా మందిని ఆకట్టుకుంటోంది. అయితే కొన్ని వివాహ వేడుకల్లో వధూవరుల వింత ప్రవర్తన మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేదికపై వధూవరులు ఉన్నారు. జయమాల కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు దండలు మార్చుకున్న తర్వాత వధువుకి వరుడు (Groom) స్వీట్ తినిపించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ స్వీట్ తినడానికి వధువు (Bride) ఇష్టపడలేదు. దాంతో వరుడికి కోపమొచ్చింది. ఆ స్వీట్ ముక్కను కిందికి విసిరిపారేశాడు. దీంతో అక్కడున్న వారందరూ నివ్వెరపోయారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త సద్ధుమణిగి అందరూ నవ్వుకున్నారు.


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4.7 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. మూడు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. పెళ్లిలోనే అలా ఉంటే తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందో అని చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్

మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 08:41 PM