Shocking Video: వామ్మో.. దోమలపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో చూశారా.. వీడియో వైరల్
ABN , Publish Date - May 15 , 2025 | 06:29 PM
మనదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ దోమల దాడి తప్పనిసరిగా మారిపోయింది. దోమల నివారణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి నుంచి తప్పించుకోవడం మాత్రం చాలా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు దోమలపై విచిత్రంగా పగ తీర్చుకున్నాడు. మనుషులను హింసిస్తున్న దోమలకు నరకం చూపించాడు.
ఇతర జంతువులతో పోల్చుకుంటే మనుషులను దోమలు (Mosquitoes) తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా మనదేశాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ దోమల దాడి తప్పనిసరిగా మారిపోయింది. దోమల నివారణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి నుంచి తప్పించుకోవడం మాత్రం చాలా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు దోమలపై విచిత్రంగా పగ తీర్చుకున్నాడు. మనుషులను హింసిస్తున్న దోమలకు నరకం చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.
@plot_twistttt అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఇంట్లోని కొన్ని దోమలను పట్టుకున్నాడు. వాటిని ఓ ప్లాస్టిక్ గ్లాస్ లోపల ఉంచాడు. ఆ తర్వాత ఆ గ్లాస్ లోపల దోమలను చంపే కాయిల్‌ను ఉంచాడు. ఆ పొగ కారణంగా ఆ దోమలన్నీ ఉక్కిరిబిక్కిరి అయి చనిపోయాయి. క్రమంగా దోమలన్నీ ఆ గ్లాస్ లోపలే చనిపోయాయి. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``వీడియో చూస్తుంటే చాలా సంతృప్తిగా ఉంది``, ``ఆ దోమలన్నింటినీ ఎలా పట్టుకున్నారు బ్రదర్``, ``ఇది నిజంగా గొప్ప రివేంజ్``, ``ఇది ప్రో మ్యాక్స్ రివేంజ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. కార్‌తో జీరో కట్ ఎలా కొట్టాడో చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే
Jugaad Video: ఇది విక్రాంత్ 2.0 బీహార్ మోడల్.. వీరి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..