Jugaad Video: ఇది విక్రాంత్ 2.0 బీహార్ మోడల్.. వీరి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ABN , Publish Date - May 15 , 2025 | 02:53 PM
ముఖ్యంగా తెలివితేటలు ఉపయోగించి కొందరు చేసే పనులు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ, ఏమూల, ఏం జరిగినా మన కళ్ల ముందుకు క్షణాల్లో వచ్చేస్తోంది. ఎవరు కొత్తగా ఏ పని చేసినా అది అందరినీ చేరిపోతోంది. ముఖ్యంగా తెలివితేటలు (Jugaad) ఉపయోగించి కొందరు చేసే పనులు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ravi_yadav అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. ఈ వీడియోను బీహార్ (Bihar)లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ నదిలో కదులుతున్న పడవ ఒడ్డు వైపు వస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఆ చిన్న పడవ (Boat)లో లోడ్ చేసిన వాటిని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. ఆ పడవపై ఓ భారీ చెక్క ప్లాట్‌ఫామ్‌ను పెట్టారు. దాని మీద భారీగా లోడ్ చేసి ఉన్న ట్రాక్టర్‌ను ఎక్కించారు. ట్రాక్టర్ ట్రాలీలో ధాన్యం లోడ్ అయి ఉంది. ఆ ట్రాక్టర్‌ను పడవ మీద చక్కగా బ్యాలెన్స్ చేసి అవతలి ఒడ్డు నుంచి ఇవతలికి తీసుకొచ్చారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు బీహార్‌లో ఏమైనా జరగొచ్చు అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 85 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇది బీహార్ మోడల్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ అని ఒకరు కామెంట్ చేశారు. బీహార్ వాళ్ల తెలివికి జోహార్లు అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. కార్‌తో జీరో కట్ ఎలా కొట్టాడో చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..