Shocking Video: వామ్మో.. ఈమెకు ఏమైంది.. హోలీ ఆడుతున్న కుర్రాళ్లను ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Mar 16 , 2025 | 07:05 PM
హోలీ అంటే కుర్రాళ్లు ఎంతో సంతోషంగా, సంబరంగా చేసుకునే పండగ. స్నేహితులకు, బంధువులకు రంగులు పూసి సంతోషంగా జరుపుకుంటారు. అయితే కొందరు కుర్రాళ్లు హద్దులు దాటి రోడ్డు మీద వెళ్లే వారిపై కూడా రంగు నీళ్లు చల్లి వారికి అసౌకర్యం కల్పిస్తారు. కొందరు ఆ కుర్రాళ్ల సరదాను సరదాగా తీసుకుంటే, మరికొందరు సీరియస్ అవుతుంటారు.

రెండ్రోజుల క్రితం హోలీ (Holi) పండుగను దేశమంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. రంగుల పండుగను అందరూ సంతోషంగా జరుపుకున్నారు. ముఖ్యంగా హోలీ అంటే కుర్రాళ్లు ఎంతో సంతోషంగా, సంబరంగా చేసుకునే పండగ. స్నేహితులకు, బంధువులకు రంగులు పూసి సంతోషంగా జరుపుకుంటారు (Holi Celebrations). అయితే కొందరు కుర్రాళ్లు హద్దులు దాటి రోడ్డు మీద వెళ్లే వారిపై కూడా రంగు నీళ్లు చల్లి వారికి అసౌకర్యం కల్పిస్తారు. కొందరు ఆ కుర్రాళ్ల సరదాను సరదాగా తీసుకుంటే, మరికొందరు సీరియస్ అవుతుంటారు.
తాజాగా @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఓ వీడియో (Viral Video) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందరు కుర్రాళ్లు రోడ్డు మీద హోలీ జరుపుకుంటున్నారు. వచ్చి పోయే వారి మీద రంగు నీళ్లు జళ్లుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో మాస్క్ ధరించిన ఓ మహిళ అక్కడకు వచ్చి వారిపై విరుచుకుపడింది. పెద్ద కర్ర తీసుకువచ్చి దొరికిన వారిని దొరికినట్టుగా చితక్కొట్టింది. దీంతో ఆ కుర్రాళ్లందరూ అక్కడి నుంచి పారిపోయారు. అక్కడున్న కొందరు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు.
ఆ ఘటనను ఓ వ్యక్తి మేడ మీద నుంచి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 75 వేల మందికి పైగా వీక్షించారు. వెయ్యి మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అక్కడేం జరుగుతోంది, అమెకు ఏమైందని ఒకరు కామెంట్ చేశారు. ఆమెకు చాలా కోపం వచ్చినట్టుంది అంటూ నెటిజన్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Groom Viral Video: వామ్మో.. ఈ వరుడేంటి ఇలా ఉన్నాడు.. వేదిక మీద అతడి ఆటిట్యూడ్ చూస్తే..
Jugaad Video: ఈ బోరు ఇలా ఉందేంటబ్బా.. నీరు బయటకు ఎలా వస్తోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: ఈ గదిలో స్పైడర్‌ను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లు షార్ప్ అని తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..